Mahesh Babu : మెగాస్టార్ రాకతో మళ్ళీ వాయిదా పడనున్న ‘సర్కారు వారి పాట’

'సర్కారు వారి పాట' అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ నే 'ఆచార్య' రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో మళ్ళీ రెండు పెద్ద సినిమాలు క్లాష్ తప్పవని ఆలోచిస్తున్నారు.........

Mahesh Babu : మెగాస్టార్ రాకతో మళ్ళీ వాయిదా పడనున్న ‘సర్కారు వారి పాట’

Chiranjeevi

Updated On : January 16, 2022 / 12:39 PM IST

Sarkaru Vari Paata :  మహేష్ బాబు ఈ సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తాడని అంతా ఆశించారు. సంక్రాంతికి డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు మహేష్ మోకాలి ఆపరేషన్ జరగడం, ఆ తర్వాత మహేష్ కి కరోనా రావడం, తర్వాత కరోనా విజృభించడంతో ఈ సినిమా వాయిదా వేశారు. సమ్మర్ కి వాయిదా వేస్తూ ఏప్రిల్ 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు నిర్మాతలు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా కారణంగా సినిమాని వాయిదా వేస్తూ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సినిమా కూడా సమ్మర్ బరిలో నిలిచింది. అయితే ‘సర్కారు వారి పాట’ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ నే ‘ఆచార్య’ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో మళ్ళీ రెండు పెద్ద సినిమాలు క్లాష్ తప్పవని ఆలోచిస్తున్నారు అంతా.

Ram Charan : షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయిన RC15

అయితే ‘సర్కారు వారి పాట’ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ కి కూడా టై పడుతుంది. ఇటీవలే మహేష్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ‘ఆచార్య’ సినిమా కూడా ఏప్రిల్ 1 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో ‘సర్కారు వారి పాట’ మళ్ళీ వాయిదా పడనుంది. ‘సర్కారు వారి పాట’ సినిమాని ఆగస్టుకి వాయిదా వేసినట్టు సమాచారం. ఆగస్టులో మహేష్ బాబు పుట్టిన రోజున ‘సర్కారు వారి పాట’ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.