Ram Charan : షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయిన RC15

సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇటీవలే ఈ సినిమాని సంక్రాంతి 2023 విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్...........

Ram Charan : షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయిన RC15

Rc 15

RC15 :  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇటీవలే ఈ సినిమాని సంక్రాంతి 2023 విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్ కూడా పూర్తయింది.

స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కావడంతో ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీగా అమ్ముడుపోయాయి. RC 15 సినిమా నిర్మాణంలో ఇటీవల జీ స్టూడియోస్ కూడా భాగమయ్యారు. దీంతో జీ స్టూడియోస్ పెడుతున్న పెట్టుబడికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సినిమా తర్వాత జీ5 లో రానుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నిటిని జీ స్టూడియోస్ కి ఇచ్చేసి అన్ని భాషల థియేట్రికల్ హక్కులను మాత్రం దిల్ రాజు తన దగ్గరే ఉంచుకున్నారు.

Sachin Joshi : నటుడు, నిర్మాత సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసిన ఈడీ

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ భారీగా పెరుగుతుంది కాబట్టి, RC15 సినిమా రిలీజ్ టైంలో వేరే భాషల థియేటర్ హక్కుల్ని అమ్మాలని అనుకుంటున్నారు దిల్ రాజు. దీంతో ఈ సినిమాకి మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి RC15 సినిమా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ అయిపోతుంది.