Ranga Reddy : 1,372 కాపురాలు నిలిపిన మహిళా పోలీసులు

చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోదామనుకునే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాలు నిలుపుతున్నారు మహిళా పోలీసులు.

Ranga Reddy : 1,372 కాపురాలు నిలిపిన మహిళా పోలీసులు

Women Police Counseling..

Women Police Counseling..1,372 Couples Compromise : చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోదామనుకునే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాలు నిలుపుతున్నారు మహిళా పోలీసులు. కాపురం విలువ తెలిసినవారు..విడిపోతే పిల్లల జీవితాలు ఏమైపోతాయో అవగాహన ఉన్నవారు..అహంతోనే..అవగాహనా లోపంతోనే విడిపోదామనుకునే భార్యా భర్తలకు అమ్మలుగా మారి కాపురాలను నిలబెడుతున్న చక్కటి వేదికగా మారింది హైదరాబాద్ లోని సరూర్ నగర్ మహిళా పోలీస్ట్ స్టేషన్. విడిపోయి నానా కష్టాలు పడకుండా దంపతుల్ని..పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం కాకుండా అమ్మలుగా అవగాహన కల్పిస్తున్నారు సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో పోలీసమ్మలు..

అదనపు కట్నం కోసం ఒకరు.. సరిగా చూడటం లేదని మరొకరు.. సంపాదన లేదని ఇంకొకరు.. తాగి కొడుతున్నాడని..నల్లగా ఉన్నావని మరొకరు.. ఇలా అర్థం పర్థం లేని కారణాతో జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకునే జంటకు పోలీసమ్మలు కౌన్సెలింగ్‌ తో కాపురాలను నిలబెడతున్నారు. ముఖ్యంగా యువ జంటలు చిన్నచిన్న వివాదాలతో ఎడమొహం పెడమొహంగా మారి ఆఖరికి విడిపోయేవరకు వెళ్తున్నారు.

Read more : Ayodhya Ram Mandir: రామ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు: హోంమంత్రి అమిత్ షా

అటువంటివారికి ఈ 2021 సంత్సరాలోనే సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో 2,246 ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్టులు, రిమండ్లు అని కేసులు నమోదు చేసేసి తమ పని అయిపోయిందనుకోవట్లేదు మహిళా పోలీసులు. కేసు పెట్టటానికి వచ్చే జంటలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మరీ వివాదం ఎక్కువైన జంటలకు రిమాండ్‌కు తరలించే ముందే పలు సిట్టింగ్ తో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. విడిపోదామనుకున్న వారు కౌన్సె లింగ్‌తో మనసు మారేలా చేస్తున్నారు. అలా పలు జంటలు గొడవలతో స్టేషన్ కు వచ్చినవారు కాస్తా చక్కగా కలిసి ఇంటికి వెళుతున్నారు. వారి మనస్సు మారేలా పోలీసమ్మలు వ్యవహరిస్తున్నారు. అలా ఈ 2021లో 1,372 జంటలు ఒక్కటికావడం విశేషం.

Read more : Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

చిన్న విషయంలో మధ్య మనస్పర్థలు వచ్చి..చివరికి విడాకుల వరకు వెళ్లిన ఓ యువ జంట సరూర్‌నగర్‌ మహిళా పోలీసు స్టేషన్ కు వచ్చారు. పోలీసులు దంపతులిద్దరినీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటైపోయి హ్యాపీగా ఇంటికెళ్లారు. అలా మరో జంట..వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు. పిల్లల పెంపకం విషయంలో గొడవ పడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా విన్పించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు..విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య.. భార్యే వేధిస్తోందని భర్త ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో వారి మనస్పర్ధలు సమసిపోయి ఒక్కటయ్యారు. ఇలా ఒకటీ రెండు కాదు..పదీ ఇరవై కాదు 1,372 జంటలు కలిసి సంతోషంగా ఉడేలా చేస్తున్నారు మహిళా పోలీసులు.

కౌన్సెలింగ్ లు అయినా వినకపోతేనే కేసు నమోదు..
ఇలా గొడవలు పడి కేసులు నమోదు చేయటానికి వచ్చేవారి గురించి సరూర్ నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ మంజుల మాట్లాడుతు..మా స్టేషన్ కు ప్రతీరోజు దాదాపు 40–50 ఫిర్యాదులు వస్తుంటాయి. వీరిలో ఎక్కువమంది యువ దంపతులే ఉంటారు. . పెళ్లైన రెండు మూడేళ్లకే గొడవలు పడి అవికూడా చిన్నచిన్నవాటికి గొడవలకే విడిపోతామని కేసులు నమోదు చేయటానికి వస్తుంటారని తెలిపారు. అలా అవగాహన లేకుండా అహంతోను..క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటివారిని తాము సాధ్యమైనంత వరకు కలిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిాపరు. అలా కౌన్సెలింగ్‌తో 70 శాతం మంది కలిసిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వినరు. కౌన్సెలింగ్‌ ఇచ్చినా వినని వారిని మాత్రమే కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.