OnePlus Phone Updates : 2023 నుంచి ఆ వన్‌ప్లస్ ఫోన్లలో 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. మీ ఫోన్ మోడల్ కూడా ఉండొచ్చు.. చెక్ చేసుకోండి..!

OnePlus Phone Updates : చైనీస్ టెక్నాలజీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) వచ్చే ఏడాది (2023) నుంచి ఎంపిక చేసిన కొన్ని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫోర్డ్ జనరేషన్ ఆక్సిజన్‌ఓఎస్ (OxygenOS) ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్టు ప్రకటించింది.

OnePlus Phone Updates : 2023 నుంచి ఆ వన్‌ప్లస్ ఫోన్లలో 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. మీ ఫోన్ మోడల్ కూడా ఉండొచ్చు.. చెక్ చేసుకోండి..!

Selected OnePlus phones to get four major Android updates from 2023

OnePlus Phone Updates : చైనీస్ టెక్నాలజీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) వచ్చే ఏడాది (2023) నుంచి ఎంపిక చేసిన కొన్ని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫోర్డ్ జనరేషన్ ఆక్సిజన్‌ఓఎస్ (OxygenOS) ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఏయే స్మార్ట్‌ఫోన్లలో ఐదేళ్లపాటు 4 ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనుందో కంపెనీ వెల్లడించలేదు.

ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొడక్ట్ హెడ్ గ్యారీ చెన్ ప్రకారం.. OnePlus, Oppoలో ఎంచుకున్న డివైజ్‌ల కోసం రెండు నెలల అప్‌డేట్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే శాంసంగ్ (Samsung) ఆప్షన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 4 ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించిన మొదటి బ్రాండ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

వన్‌ప్లస్ 11 (OnePlus 11) 2023 మొదటి ఆరు నెలల్లో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు.. ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వివరాలు లీకయ్యాయి. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Selected OnePlus phones to get four major Android updates from 2023

Selected OnePlus phones to get four major Android updates from 2023

Read Also : OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ కొత్త డిజైన్ లీక్.. 108MP ట్రిపుల్ కెమెరాలు ఉండొచ్చు.. లాంచ్ ఎప్పుడంటే?

టిప్‌స్టర్ మాక్స్ జాంబోర్ ప్రకారం.. ఈ డివైజ్ కొత్త కలర్ వేరియంట్‌లో రానుంది. అయితే.. ఈ స్మార్ట్‌ఫోన్ మాట్ బ్లాక్, గ్లోసీ గ్రీన్ కలర్ ఫినిషింగ్‌లలో రావచ్చు. ఈ డివైజ్ ఇతర కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు. OnePlus వన్‌ప్లస్ 11 ఒకే మోడల్‌ను తీసుకురావొచ్చు.ఈ ఏడాదిలో Pro మోడల్ ఉండకపోవచ్చు. కంపెనీ ‘Pro’ ఫీచర్లతో ఒకే OnePlus 11ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. OnePlus 11 వెనుక 3 సెన్సార్‌లతో Hasselblad కెమెరాతో వస్తుందని చెప్పవచ్చు. రాబోయే హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్, టెలిఫోటో లెన్స్‌తో ఉండవచ్చు.

Selected OnePlus phones to get four major Android updates from 2023

Selected OnePlus phones to get four major Android updates from 2023

సెల్ఫీల కోసం.. OnePlus 11 ముందు భాగంలో 32MP కెమెరాను అందిస్తుందని పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కెమెరా కటౌట్‌ను అందించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. అలాగే ప్రాసెసర్ గరిష్టంగా 16GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో రావొచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 10 Pro 5G : భారత్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5Gపై బిగ్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!