Shahrukh Khan : డైరెక్టర్స్‌కి కండిషన్స్ పెడుతున్న బాలీవుడ్ బాద్షా..

 బాలీవుడ్ బాద్ షా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న షారూఖ్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు. పఠాన్ , జవాన్ , డంకీ లాంటి........

Shahrukh Khan : డైరెక్టర్స్‌కి కండిషన్స్ పెడుతున్న బాలీవుడ్ బాద్షా..

Shahrukh Khan :  బాలీవుడ్ బాద్ షా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న షారూఖ్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు. పఠాన్ , జవాన్ , డంకీ లాంటి భారీ సినిమాలు చేస్తున్న షారూఖ్ ని మెప్పించడానికి డైరెక్టర్లు 3 చెరువుల నీళ్లు తాగాల్సొచ్చింది. నాన్ ఇంటర్ ఫియరింగ్ యాక్టర్ గా షారుఖ్ కి బాలీవుడ్ లో మంచి పేరుంది. అంత క్యాజువల్ గా ఉంటారు షారూఖ్. అయితే ఇవన్నీ ఇంతకుముందు వరకే. ఇప్పుడు మాత్రం షారూఖ్ చేత సినిమా ఓకే చేయించడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుందట డైరెక్టర్లకు. ఆ రేంజ్ లో తన డైరెక్టర్లైన సిద్దార్ద్ ఆనంద్, రాజ్ కుమార్ హిరానీ, అట్లీతో పాటు తనతో సినిమాలు చెయ్యాలనుకునే డైరెక్టర్లకు కండిషన్లు పెట్టారు షారూఖ్.

పాత వాళ్లైనా, కొత్తవాళ్లైనా హీరోయిన్లు ఎవరైనా పర్లేదు కానీ స్క్రీన్ మీద తన ఏజ్ కి సరిపోయే వాళ్లే, స్క్రీన్ మీద తనకి మ్యాచ్ అయ్యే వాళ్లకే ఓకే చెబుతానని ముందే కండిషన్ పెడుతున్నారంట షారూఖ్. అందుకే షారూఖ్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లు గా దీపికా పదుకోన్, నయనతార, తాప్సీ లాంటి సీనియర్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

RGV : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా చావులు అంటూ.. ఆర్జీవీ నెక్స్ట్ మూవీ ‘కొవిడ్ ఫైల్స్’..

తనతో సినిమాలు చేస్తున్న వాళ్లకు, చెయ్యాలనుకునే వాళ్లకు షారూఖ్ పెట్టిన మరో కండిషన్ కథ. కథలో తన క్యారెక్టర్ మరీ యంగ్ గా కనిపించకూడదని, ప్రజెంట్ తన లుక్ కి సూట్ అయ్యేలా కథలుండాలని, ప్రస్తుత పరిస్తితులకు రిలేట్ అయ్యేలా సినిమా ప్లాన్ చెయ్యాలని మరో స్ట్రిక్ట్ రూల్ పెట్టారు షారూఖ్ . అంతేకాదు లవ్ స్టోరీలు కాకుండా ఛాలెంజెంగ్ రోల్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ హీరో. అందుకే ప్రజెంట్ షారూఖ్ చేస్తున్న సినిమాలన్నీ యాక్షన్ ,స్పై, మాస్ మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. మరి ఇలా కండిషన్స్ పెడుతున్న షారుఖ్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తాడో చూడాలి.