Pathaan Collections : పఠాన్ @ 550 కోట్లు.. ఆదివారం ఒక్కరోజే 130 కోట్లు..
ఐదురోజుల్లో పఠాన్ సినిమా 550 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి మరో రికార్డ్ సెట్ చేసింది. ఒక్క ఆదివారం రోజే 70 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే దాదాపు.............

Shahrukh Khan Pathaan Movie Collects 550 crores in 5 days
Pathaan Collections : షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవలే పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండటం, షారుఖ్ చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో కనపడటంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇప్పట్లో ఏ సినిమా పరిశ్రమలో కూడా వేరే సినిమాలు రిలీజ్ లేకపోవడంతో పఠాన్ కి మరింత కలిసొచ్చింది.
దీంతో పఠాన్ సినిమా కెల్క్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. మొదటి రోజే 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ నాలుగు రోజుల్లో 429 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. దీంతో అత్యంతవేగంగా 400 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా అత్యంత వేగంగా 200 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
ఇక సినిమా రిలీజయి ఆదివారానికి అయిదు రోజులు అయింది. ఒక రోజు ముందే రిలీజ్ చేసి వీకెండ్ ని మంచి క్యాష్ చేసుకున్నారు చిత్రయూనిట్. ఐదురోజుల్లో పఠాన్ సినిమా 550 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి మరో రికార్డ్ సెట్ చేసింది. ఒక్క ఆదివారం రోజే 70 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు. ఇది రిలీజ్ రోజు కంటే కూడా చాలా ఎక్కువ. పఠాన్ సినిమా కలెక్షన్స్ లో ఈ రేంజ్ లో జోరు చూపిస్తుండటంతో షారుఖ్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరో వారం రోజుల పాటు కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో పఠాన్ కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయిదు రోజుల ఫైనల్ కలెక్షన్స్ మరికొన్ని గంటల్లో నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించనుంది.
#Pathaan Day 5 All-India Nett early estimates is a whopping ₹ 70 Crs.. ?
— Ramesh Bala (@rameshlaus) January 30, 2023
#Pathaan 5 days WW Gross expected to be in the range of ₹ 550 Crs..
— Ramesh Bala (@rameshlaus) January 30, 2023