Shankar Indian-2 Film: సఫలం కాని చర్చలు.. వివాదం మళ్ళీ మొదటికే!

దేశంలో టాప్ దర్శకులలో ఒకరైన శంకర్ ఈ మధ్య కాలంలో వరస వివాదాలలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు యంగ్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించగానే ఇండియన్-2 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ శంకర్ మీద కోర్టు కెక్కింది.

Shankar Indian-2 Film: సఫలం కాని చర్చలు.. వివాదం మళ్ళీ మొదటికే!

Shankar Indian 2 Film

Shankar Indian-2 Film: దేశంలో టాప్ దర్శకులలో ఒకరైన శంకర్ ఈ మధ్య కాలంలో వరస వివాదాలలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు యంగ్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించగానే ఇండియన్-2 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ శంకర్ మీద కోర్టు కెక్కింది. సౌత్ బ్లాక్ బస్టర్ అన్నియన్ సినిమాను హిందీ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించగానే ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుండి మరో వివాదం మొదలైంది. దీంతో ప్రస్తుతం శంకర్ ఈ వివాదాలను ఎలా పరిష్కరించుకుంటాడా అనే చర్చ జరుగుతుంది.

ఇండియన్-2 సినిమా పూర్తిచేయకుండా మరో సినిమాకు ఎలా వెళ్తారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెళ్ళగా.. ఈ అంశంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని.. కోర్టు బయటే ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో లైకా సంస్థ – శంకర్ మధ్య పలువురు పెద్దలు సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా అది కుదరలేదు. ఇక శంకర్ తరపు న్యాయవాది కూడా నిర్మాణ సంస్థతో జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదని తెలుస్తుంది. ఎవరికి వారు వారి పంతమే నెగ్గాలని చూడడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది.

లైకా నిర్మాత సంస్థలో సమావేశమైన శంకర్ తరపు లాయర్లు దర్శకుడు సినిమాను జూన్ నుండి అక్టోబర్ మధ్యలో పూర్తి చేస్తారని.. అందుకు తగిన కారణాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే లైకా నిర్మాతలు మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబడుతున్నట్లు తెలిసింది. సినిమా కోసం విదేశీ నిపుణులు కావాల్సి ఉందని చెప్తున్న శంకర్ ప్రస్తుత కోవిడ్ పరిస్థితిలో అది కుదరదని చెప్తున్నారు. అయితే.. నిర్మాతలు మాత్రం జూన్ నాటికే సినిమా పూర్తికావాలని పట్టుబడుతున్నారు. అంటే ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తుంది. మరి దీనిపై ఈసారి కోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంది.