Thaman : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం ‘భీమ్లా నాయక్’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్..

ఎంత బిజీగా ఉన్నప్పటికి సింగర్ గీతా మాధురితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఏకంగా గంటకు పైగా మాట్లాడాడు థమన్..

Thaman : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం ‘భీమ్లా నాయక్’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్..

Thaman S

Updated On : January 24, 2022 / 6:22 PM IST

Thaman: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘అఖండ’ థమన్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. స్పీకర్స్ బద్దలైపోయే రేంజ్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసాడు. సినిమా సక్సెస్‌లో థమన్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది.

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

‘అరవింద సమేత’, ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత త్రివిక్రమ్‌తో ‘భీమ్లా నాయక్’ సినిమాకి పని చేస్తున్నాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా థమన్‌ని ఫిక్స్ చేశారు.

S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!

ఇటీవల ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తున్న వీడియో షేర్ చేసి మహేష్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసాడు థమన్. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ మీద ఫోకస్ పెట్టాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికి సింగర్ గీతా మాధురితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఏకంగా గంటకు పైగా మాట్లాడాడు థమన్.

Thaman S : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు థమన్ రీ రికార్డింగ్!

‘సర్కారు వారి పాట’ లో అన్ని పాటలూ ఫుల్ కమర్షయల్‌గా, హై ఎనర్జీతో ఉంటాయని చెప్పిన థమన్.. ‘భీమ్లా నాయక్’ కోసం కొత్త సౌండ్ ట్రై చేసానని.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని.. పక్కా బ్లాక్ బస్టర్, దానికి మించి ఉంటుందని చెప్పి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చాడు థమన్.

 

View this post on Instagram

 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)