Sunitha : మీకు దండం రా నాయనా.. తల్లి కాబోతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సునీత..

ఓ వెబ్ సైట్ లో సునీత తల్లి కాబోతుంది అంటూ రాసిన వార్తను తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ''దేవుడా.. మనుషులు మరీ........

Sunitha : మీకు దండం రా నాయనా.. తల్లి కాబోతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సునీత..

Sunitha (1)

Updated On : April 23, 2022 / 7:05 PM IST

Sunitha :  తన పాటలతో ఎంతోమందిని మైమరిపిస్తున్న సింగర్ సునీత గత సంవత్సరం రామ్‌ వీరపనేని అనే ప్రముఖ మీడియా వ్యక్తి, వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకుంది. ఈ వివాహంతో సునీత కొద్దిరోజులు హాట్ టాపిక్ గా వార్తల్లో నిలిచింది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది సునీత. తన ఫోటోలు, తన వర్క్, అలాగే తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులకి మరింత దగ్గరగా ఉంటుంది. ఇటీవల సునీత తన పొలంలో, అక్కడ పండిన పంటలతో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా సునీత తన మామిడి తోటలో ఓ మామిడి చెట్టు దగ్గర కూర్చుని మామిడి కాయలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లెస్డ్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ సునీత మళ్ళీ తల్లి కాబోతుందా? అందుకే మామిడికాయని చూపిస్తూ బ్లెస్సెడ్ అని పోస్ట్ చేసింది అంటూ వార్తలు రాశారు. దీంతో ఈ వార్తలని చూసిన సునీత వీటిపై స్పందించింది.

Shivathmika : శివాత్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్

ఓ వెబ్ సైట్ లో సునీత తల్లి కాబోతుంది అంటూ రాసిన వార్తను తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”దేవుడా.. మనుషులు మరీ ఇంత పిచ్చివాళ్లుగా ఉన్నారు. నేను ఈరోజు మొదటిసారి పండిన మా మామిడి పంటతో ఒక ఫోటో పోస్ట్ చేశాను. కానీ ఇలా వార్తలు రాస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఆపండి. దండం రా నాయనా” అంటూ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది సునీత.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)