Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ప్రాక్టీస్ దేనికోసమో?

తాజాగా కొరియోగ్రాఫర్‌, బిగ్‌బాస్‌5 కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోని షేర్ చేసింది సితార. గతంలో కూడా సితార తను చేసిన డ్యాన్స్ వీడియోల్ని.....

Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ప్రాక్టీస్ దేనికోసమో?

Sithara

Updated On : November 26, 2021 / 11:53 AM IST

Sitara Ghattamaneni :   సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూతురు సితార సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలతో పాటు అప్పుడప్పుడు తన డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఏకంగా యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది. సోషల్ మీడియాలో సితారకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా కొరియోగ్రాఫర్‌, బిగ్‌బాస్‌5 కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోని షేర్ చేసింది సితార. గతంలో కూడా సితార తను చేసిన డ్యాన్స్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Samantha : 12 ఏళ్ళ తర్వాత ఆడిషన్ ఇచ్చిన సమంత.. అప్పుడు టాలీవుడ్.. ఇప్పుడు హాలీవుడ్..

డీజే స్నేక్ చార్ట్‌ బస్టర్ ‘టకీ టకీ’అనే పాటకు సితార, యాని మాస్టర్ ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో షేర్ చేసి ‘యానీ మ్యామ్‌ స్టెప్పులతో రీచ్‌ అవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా రావాల్సి ఉంది’ అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే సితార యాని మాస్టర్ దగ్గర ఇప్పుడు డ్యాన్స్ ఎందుకు నేర్చుకుంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా ప్రోగ్రాంకా లేక మామూలుగానే డ్యాన్స్ నేర్చుకుంటుందా అని ఆరా తీస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)