నో పెళ్లి..దాని తల్లి : సోలో బ్రతుకే సో బెటర్ న్యూ సాంగ్

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 06:16 AM IST
నో పెళ్లి..దాని తల్లి : సోలో బ్రతుకే సో బెటర్ న్యూ సాంగ్

‘నో పెళ్లి..దాని తల్లి..ఈ తప్పు చేయకురా..వెళ్లి..భరించలేని పెళ్లికున్న యాతన..ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన’. అంటున్నా మెగాస్టార్ సాయి ధరమ్ తేజ. ఈయన నటించిన న్యూ ఫిల్మ్ ‘సోలో బ్రతుకు సో బెటర్’ ఓ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సాంగ్‌లో వరుణ్ తేజ్ కూడా కనిపించడం విశేషం.

ఇతని సరసన నభా నటెష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హీరో..వరుస సినిమాలు చేస్తూ..ఆకట్టుకుంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను చవి చూశాడు. తర్వాత..కొన్ని ఫ్లాపులను తన ఖాతాలో వేసుకున్నాడు. చిత్రలహరి సినిమా చేసిన ఈ నటుడు..‘ప్రతి రోజు పండుగే’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నాడు తేజ్. అదే జోష్ తో మరిన్ని సినిమాలకు ఒకే చెబుతున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట. కానీ కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాప కూడా పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

సోలో బ్రతుకే సో బెటర్ అనే టైటిల్ చూస్తేనే..ఇదొక బ్యాచిలర్ స్టోరీ అని అర్థం అవుతోంది. పెళ్లి అంటే ఇష్టం లేక సోలోగా ఉండడం బెటర్ అనుకునే హీరో..కథ అని సమాచారం. జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆదీ కూడా నటిస్తున్నాడని టాక్. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ తన విజయాల పరంపర కొనసాగిస్తాడా ? లేడా ? అనేది చూడాలి. 

Read: కరోనా దెబ్బ : విలువైన వస్తువులు వేలం వేస్తున్న ఫిల్మ్ స్టార్స్