Sonal Chauhan : అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయి..

తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. ''తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా ఉంటారు. కొత్తగా ఆలోచించి ప్రేక్షకుడికి ఏం కావాలో..................

Sonal Chauhan : అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయి..

Sonal

F3 :  లెజెండ్, డిక్టేటర్, రూలర్.. మరిన్ని సినిమాలతో తెలుగులో మెప్పించిన సోనాల్ చౌహాన్ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F3 సినిమాలో సోనాల్ ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా మే 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సోనాల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ”లెజెండ్ సినిమా చేస్తున్నప్పుడే అనిల్ రావిపూడి గారితో పరిచయం అయింది. ఆ సమయంలోనే నాతో సినిమా చేస్తా అని మాటిచ్చారు అనిల్. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పటికి కుదిరింది ఆయనతో కలిసి పని చేయడానికి. ఆయనే ఫోన్ చేసి F3 అనే సినిమా చేస్తున్నాను, ఓ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు. హీరోయిన్ రోల్ కాకపోయినా నా కెరీర్ లోనే ఫస్ట్ కామెడీ సినిమా అని ఒప్పుకున్నాను. కథని మలుపు తిప్పే పాత్ర ఇది. అప్పటికే నేను F2 సినిమా చూడటంతో ఆలోచించకుండా F3కి ఓకే చెప్పాను.”

Richa Chadha : వారి వల్లే బాలీవుడ్‌కి నష్టాలు.. సౌత్‌లో అలా ఉండదు..

”కామెడీ ఎంటర్టైనర్ మొదటి సారి కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏమైనా సినిమాలు చూడాలా? అని అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఆయన ఏమీ అలోచించకుండా డైరెక్ట్ గా షూటింగ్‌కు వచ్చేయమని చెప్పారు. అనిల్ గారితో వర్క్ చేయడం ఎవరికైనా చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయన చెప్పినట్లే చేస్తే చాలు, ఆయనకి కావాల్సింది ఆర్టిస్టుల నుంచి ఆయనే రాబట్టుకుంటారు. సెట్స్‌లో చాలా సరదాగా జోకులు వేస్తుంటారు. కష్టాన్ని కూడా కామెడీగా మార్చేస్తారు. నా పాత్ర గురించి బయటకి రివీల్ చేయలేదు. ట్రైలర్‌లో కూడా చెప్పలేదు. సినిమా చూసి తెలుసుకోవాలి. నా పాత్రని చూసి ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైనర్ ఫీల్ అవుతారు” అని సినిమా గురించి, తన పాత్ర గురించి తెలిపింది.

BiggBoss Siri : సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. సపోర్ట్ తీసుకోదు.. ప్రియుడి వ్యాఖ్యలు..

తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. ”తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా ఉంటారు. కొత్తగా ఆలోచించి ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుకుంటుంది. అందుకే తెలుగులో సినిమా వస్తే నో చెప్పను” అని చెప్పింది.