Richa Chadha : వారి వల్లే బాలీవుడ్‌కి నష్టాలు.. సౌత్‌లో అలా ఉండదు..

రిచా మాట్లాడుతూ.. ''సౌత్ సినిమాలకు అక్కడ టికెట్ రేట్లు 100 నుంచి 400 రూపాయలలోపే ఉంటాయి. అక్కడి స్టార్ హీరోలకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా....................

Richa Chadha : వారి వల్లే బాలీవుడ్‌కి నష్టాలు.. సౌత్‌లో అలా ఉండదు..

Richa

Richa Chadha :  గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. మన సినిమాలన్నీ అక్కడ భారీ విజయం సాధిస్తున్నాయి, వసూళ్లు రాబడుతున్నాయి. అంతే కాక సౌత్ సినిమాలని చాలా వరకు నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టు నడుస్తుంది. ఈ పరిస్థితిపై పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు కొంతమంది సౌత్ సినిమాలకి సపోర్ట్ గా మాట్లాడితే మరి కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమందేమో బాలీవుడ్ లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రిచా చద్దా సౌత్ సినిమాల కలెక్షన్స్ పై వ్యాఖ్యలు చేసింది.

గ్యాంగ్స్ అఫ్ వస్పూర్ తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రిచా చాలా సినిమాల్లో, సిరీస్ లలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇటీవల రిచా చద్దా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ సినిమాలకి కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, బాలీవుడ్ సినిమాలకి ఎందుకు కలెక్షన్స్ రావట్లేదో వివరణ ఇచ్చింది.

 

Kangana Ranaut: హాలీవుడ్ కథలకు ఇన్స్ పిరేషన్ మన వేదాలే.. కంగనా కొత్త కామెంట్స్!

రిచా మాట్లాడుతూ.. ”సౌత్ సినిమాలకు అక్కడ టికెట్ రేట్లు 100 నుంచి 400 రూపాయలలోపే ఉంటాయి. అక్కడి స్టార్ హీరోలకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. తమ అభిమాన హీరో కోసం ఆ మాత్రం ఖర్చు చేసేందుకు ఆలోచించారు. టికెట్ రేట్లు కాస్త తక్కువ కాబట్టి మొదటి వారంలోనే అంతా ఫ్యామిలీలతో కలిసి సినిమాకి వెళ్తారు. అందుకే అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సౌత్ సినిమాలకి కలెక్షన్స్ వస్తాయి. కానీ మన దగ్గర అలా కాదు ఇక్కడ చాలా థియేటర్లలో టికెట్ రేటు ఎక్కువగానే ఉంటుంది. మాల్స్ లో అయితే 400 కంటే ఎక్కువగానే ఉంటుంది టికెట్ రేటు. అప్పుడు మధ్య తరగతి వాళ్ళు అంత ధర పెట్టి సినిమా చూసేందుకు ఆలోచిస్తారు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని మామూలు ప్రజలు ఆలోచిస్తారు. ఇక సినిమా ప్లాప్ టాక్ వస్తే అస్సలు సినిమాకి రారు దీంతో కలెక్షన్స్ మరీ దారుణంగా ఉంటాయి. బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్లే సినిమాకి నష్టం చేకూరుతుంది” అని తెలిపింది.