Mega154: మెగాస్టార్‌తో మాస్ చిందులు.. ఆ తరువాతే యాక్షన్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా154 అనే వర్కింగ్ టైటిల్‌తో....

Mega154: మెగాస్టార్‌తో మాస్ చిందులు.. ఆ తరువాతే యాక్షన్..?

Song Shoot On Chiranjeevi Raviteja For Mega154

Mega154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా154 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?

ఈ సినిమా షూటింగ్‌లో తాజాగా రవితేజ జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, సినిమాకు ఆయన పాత్ర హైలైట్‌గా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌లో చిరు, రవితేజ ఇద్దరిపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌లో భాగంగా ముందుగా చిరు, రవితేజలపై ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట మెగా 154 చిత్ర టీమ్.

Mega154: వాల్తేర్ వీరయ్య కోసం రామారావు డ్యూటీ ఎక్కుతున్నాడా..?

ఆ తరువాత జూలై 18 నుంచి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.