Sonia Gandhi: ఈడీ విచారణకు సోనియా మూడో రోజు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు.

Sonia Gandhi: ఈడీ విచారణకు సోనియా మూడో రోజు

Sonia

 

 

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్‌కి బదలాయింపు, షేర్ల వాటాలు, ఆర్ధిక లావాదేవీల అంశాలపై సోనియాను అడుగుతున్నారు. ఈడీ అధికారులు జులై 21న 3 గంటలు, 22న 6 గంటల పాటు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిరసన తెలపనున్నాయి. ఉదయం 9గంటల 30నిమిషాలకు ఖర్గే నివాసంలో ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది. ఉదయం 10గంటల 15నిమిషాలకు పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరుగుతుంది.

Read Also: రాహుల్‌, ప్రియాంక‌తో ఈడీ ఆఫీసుకు సోనియా.. విచార‌ణ షురూ

ఇందులో భాగంగా పార్లమెంటు లోపల, వెలుపల అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.