Sonu Sood: సోనూసూద్‌కి అరుదైన గౌరవం.. యూఏఈ గోల్డెన్ వీసా!

ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి కరోనా సమయంలో దేశం మొత్తం తనకు చేతనైన సహాయ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. వలస కార్మికుల్ని..

Sonu Sood: సోనూసూద్‌కి అరుదైన గౌరవం.. యూఏఈ గోల్డెన్ వీసా!

Sonu Sood

Sonu Sood: ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి కరోనా సమయంలో దేశం మొత్తం తనకు చేతనైన సహాయ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం దగ్గర నుండి.. పేదవారికి ఆర్థిక సహాయం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఆసుపత్రులకు ఆక్సిజెన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి సోను భాయ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం కూడా సోనూసూద్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు.

Sonu Sood: ‘యుక్రెయిన్ స్టూడెంట్ల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించండి’

సోనూ సేవా కార్యక్రమాలకి గాను ఇప్పటికే పలు సంస్థలు అతడిని సత్కరించగా తాజాగా తాజాగా ఆయన దుబాయ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాతకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా ‘యూఏఈ గోల్డెన్‌ వీసా’ను అందించింది. ఈ దుబాయ్‌ గోల్డెన్‌ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్‌. నేను సందర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్‌ ఒకటి. ఇది అభివృద్ధి చెందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు, ప్రభుత్వానికి కృ​తజ్ఞతలు తెలుపుతున్నానని సోనూసూద్‌ పేర్కొన్నాడు.

Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్.. కేసు నమోదు.. కారు సీజ్!

ఇక, యూఏఈ గోల్డెన్ వీసా విషయానికి వస్తే.. అది పొందడం ఆషామాషీ కాదు. భారీగా పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు మాత్రమే గోల్డెన్ వీసాని పొందేందుకు అర్హులు. ఈ గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి జారీ చేస్తుండగా.. దీని సాయంతో దుబాయ్ లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నివసించవచ్చు. స్థానికులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి కూడా ఉంటాయి. 5 నుంచి 10 ఏళ్ల వరకు దీని కాలపరిమితి ఉండగా.. అనంతరం రెన్యూవల్ అవుతుంది. ఇప్పటికే మన దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సతీమణి ఉపాసనా ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు.