Sonu Sood: ‘యుక్రెయిన్ స్టూడెంట్ల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించండి’

యుద్ధ ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి రాలేని ఇండియన్ స్టూడెంట్లు అక్కడే చిక్కుకుపోయారు. ప్రత్యేక విమానాలతో కొందరినీ మాత్రమే తరలించగా.. మిగిలిన వారి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sonu Sood: ‘యుక్రెయిన్ స్టూడెంట్ల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించండి’

Sonu Sood (1)

Sonu Sood: రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలుకోల్పోయారు. ఇక యుద్ధ ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి రాలేని ఇండియన్ స్టూడెంట్లు అక్కడే చిక్కుకుపోయారు. ప్రత్యేక విమానాలతో కొందరినీ మాత్రమే తరలించగా.. మిగిలిన వారి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేల మంది స్టూడెంట్లు విద్యను అభ్యసించేందుకు అక్కడకు వెళ్లి చిక్కుకుపోయారని వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్ల కోసం సోనూ సూద్ ముందుకొచ్చాడు.

యుక్రెయిన్ లో ఇరుక్కుపోయిన ఇండియన్ స్టూడెంట్లు ఇంటికి సేఫ్ గా తిరిగిచ్చేలా ప్లాన్ చేయాలంటూ ఇండియన్ గవర్నమెంట్ ను సోనూ సూద్ కోరారు.

గురువారం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆదేశాల అనంతరమే సోనూ సూద్ ఇలా ట్వీట్ చేశారు.

Read Also : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!

‘చాలా కుటుంబాలకు చెందిన 18వేల మంది స్టూడెంట్లు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. ప్రభుత్వం వాళ్లను తిరిగి సొంతిళ్లకు చేరుస్తుందని నమ్ముతున్నాను. అక్కడ నుంచి వచ్చేందుకు ఇండియన్ ఎంబస్సీ ఏవైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నా. వారి క్షేమం గురించి ప్రార్థిస్తున్నా’ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.

తమ పిల్లలు బాంబుల నడుమ భయంభయంగా బతుకుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని శాంతియుత మార్గాల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎంబసీ పలు సూచనలు చేస్తోంది.

Read Also : చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ ప‌రిష్కారం- రష్యా, యుక్రెయిన్ల యుద్ధంపై చైనా కీలక ప్రకటన

యుక్రెయిన్ నుంచి పోలాండ్ వైపు నడక దారిలో వచ్చే వారు శేహనీ – మేద్యక మధ్య సరిహద్దు దాటాలని సూచిస్తోంది. సొంత వాహనాల్లో వచ్చే వారు క్రాకో వీక్ ద్వారా సరిహద్దు దాటాలని సూచించింది. గూగుల్ మ్యాప్ ద్వారా తమ వివరాలు ఇండియన్ ఎంబసీ‌కి అందించాలని దానికనుగుణంగా విమానాలను ఏర్పాటు చేస్తామని భారత ఎంబసీ కార్యాలయం వార్సా తెలిపింది.