Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం

నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం

Hyderabad Rains

Hyderabad Rains : నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, బాచుపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పలు చోట్ల నాలాలు పొంగిపొర్లాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాన నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకొచ్చాయి. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Southwest Monsoons : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

రెండు రోజులుగా రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సింగపూర్ టౌన్ షిప్ దగ్గర 5.6 సెంమీ వర్షం కురిసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఆదివారం విజయవాడలోనూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వాన నీటితో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Telangana Rains: తెలంగాణలో ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

ఇన్నాళ్లు మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలు కురుస్తుండటంతో కాస్త రిలీఫ్ అవుతున్నారు. వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. ముందు ముందు మరిన్ని వానలు కురవాలని, వాతావరణం మరింత చల్లబడాలని కోరుకుంటున్నారు. మరోవైపు వానలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలం బాట పట్టారు.