TSSPDCL : కరెంటు సమస్యల ఫిర్యాదుకు యాప్

విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది...టీఎస్‌ఎస్‌‌పీడీసీఎల్ (TSSPDCL). ఈ యాప్ ను ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావు ఆవిష్కరించారు...

TSSPDCL : కరెంటు సమస్యల ఫిర్యాదుకు యాప్

Current

Special App For Power Problems : కరెంటు విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు ప్రజలు. కరెంటు రాకపోవడం, మీటర్లు సరిగ్గా పని చేయకపోవడం, కరెంట్లు వైర్లు.. ఇతరత్రా ఎన్నో సమస్యలుంటాయి. అంతేగాకుండా తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని కొంతమంది అధికారులపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. కొంతమందికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో.. వారికి అర్థం కాదు. విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది.

Read More : Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య

టీఎస్‌ఎస్‌‌పీడీసీఎల్ (TSSPDCL). ఈ యాప్ ను ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TSSPDCL సీఎండీ రఘురామారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించడం జరిగిందని, దీని ద్వారా విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందన్నారు. అధికారుల పని తీరుపైన కూడా ఇందులో సమాచారం ఇవ్వొచ్చన్నారు.

Read More : Current Bill : వామ్మో.. కరెంటు బిల్లు రూ.6.74 లక్షలా?

కంజ్యుమార్ గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ఏ సమస్యనైన పరిష్కారం ఈ గ్రీవెన్స్ సెల్ తీసుకుంటుందని, విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా సమాచారం ఇవ్వొచ్చన్నారు. గ్రీవెన్స్ సెల్ సమస్య పరిష్కారం చూపెట్టకపోతే అంబుడ్స్ మెన్ అథారిటికి కంప్లైట్ చేయొచ్చని, ఇలాంటి వాటి అన్నింటి కోసం యాప్ తీసుకొచ్చామన్నారు. దీన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని, ఈ యాప్ లో వచ్చిన పిర్యాదు పై సంబంధిత అధికారులకు స్పందించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.