Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామాని చెందిన పదో తరగతి చదివే 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారంచేసి హత్య చేశారు.

Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య

Vikarabad Dead Body

Updated On : March 28, 2022 / 12:40 PM IST

Vikarabad : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామాని చెందిన పదో తరగతి చదివే 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారంచేసి హత్య చేశారు. ఈరోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోటానికి బహిర్భూమికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోటంతో కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకసాగారు.
Also Read : Amarnath Yatra: జూన్ ౩౦ నుంచి అమర్ నాథ్ యాత్ర

ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో బాలిక మృతదేహం లభించింది. వెంటనే వారు సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.