‘నా పంచెలో రామాయణమేనా’.. టీజర్ అదిరిందిగా..

‘నా పంచెలో రామాయణమేనా’.. టీజర్ అదిరిందిగా..

SR Kalyanamandapam: “రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే ఇటు ప్రేక్ష‌కుల్ని అటు విమ‌ర్శ‌కుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు.

“ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం EST. 1975” అంటూ టైటిల్‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. శ్రీకాంత్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయిక. ఫన్, లవ్ అండ్ ఎమోషనల్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.

SR Kalyanamandapam

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్, డైలాగ్స్ బాగున్నాయి. హీరో, తన గర్ల్ ఫ్రెండ్ నడుం గురించి, హీరోయిన్ హీరోని కుక్కతో పోలిస్తే హీరో అలాగే చూసుకో అంటూ వివరంగా చెప్పడం భలే అనిపించాయి. ఇంకో విశేషం ఏంటంటే.. హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు.

ముఖ్యంగా ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ చెప్పిన డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. తులసిని తిట్టే డైలాగ్ నవ్విస్తోంది. తులసి, సాయి కుమార్ హీరో తల్లిదండ్రులుగా నటించారు.
‘నా పంచెలో రామాయణమేనా’ అనే డైలాగ్ హైలెట్ అసలు.. స్టూడెంట్ అయిన హీరో “ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం EST. 1975” పేరుతో కళ్యాణ మండపం పెట్టడం, అందరూ అతణ్ణి ఎగతాళి చెయ్యడం వంటివి సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.