Sreeleela : శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా.. అప్పుడే చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసింది..

టాలీవుడ్ లో శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా. కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కొట్టింది. మరే సినిమా రిలీజ్ కాకుండానే శ్రీలీల చీఫ్ గెస్ట్ రేంజ్‌కి..

Sreeleela : శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా.. అప్పుడే చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసింది..

Sreeleela is the chief guest for Slum Dog Husband movie event

Updated On : July 26, 2023 / 5:44 PM IST

Sreeleela : టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన ఈ భామ.. ఆ తరువాత రవితేజ ధమాకా (Dhamaka) మూవీతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ సినిమాలో అమ్మడి యాక్టింగ్ అండ్ మాస్ డాన్స్ కి అందరూ ఫిదా అయ్యిపోయారు. దీంతో టాలీవుడ్ లో అరడజనకు పై సినిమా అవకాశాలు అందుకుంది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యిపోయింది.

Kriti Sanon : బర్త్ డేని ఒక ప్రత్యేక వ్యక్తితో.. ఒక సీక్రెట్ దాచానంటున్న కృతి.. ‘H’ అనే క్లూ.. ప్రభాస్ గురించా..?

అయితే ఈ సినిమాలు ఏవి ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఈ అమ్మడి క్రేజ్ సినిమాలతో సంబంధం లేకుండా పెరుగుతూ పోతుంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు, బాలకృష్ణ కాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవానికి, ఇటీవల అమెరికాలో జరిగిన ‘తానా’ మహాసభలకి కొందరి అతిథులతో పాటు శ్రీలీల కూడా ఒక ప్రత్యేక అతిథిగా హాజరయ్యి.. ఇప్పటి జెనరేషన్ హీరోయిన్స్ లో తానే ప్రత్యేకం అనిపించుకుంది. తాజాగా ఒక ఈవెంట్ కి తానే ముఖ్య అతిథిగా హాజరుకాబోతు తానా రేంజ్ ఏంటో తెలియజేసింది.

Guntur Kaaram : గుంటూరు కారం మూవీకి మొదటి హీరో మహేష్ కాదట.. ఎన్టీఆర్ అంటా.. నిజమెంత..!

ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ (Brahmaji) కుమారుడు సంజ‌య్ రావ్ (Sanjay Rao) హీరోగా నటిస్తున్న కొత్త మూవీ స్ల‌మ్ డాగ్ హ‌స్సెండ్ (Slum Dog Husband). ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్.. ‘ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్’ పేరిట ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి శ్రీలీల చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. “కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కొట్టింది. మరే సినిమా రిలీజ్ కాకుండానే శ్రీలీల చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసిందంటే గ్రేట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.