Guntur Kaaram : గుంటూరు కారం మూవీకి మొదటి హీరో మహేష్ కాదట.. ఎన్టీఆర్ అంటా.. నిజమెంత..!

గుంటూరు కారం మూవీ అసలు మహేష్ కోసం రాసింది కాదట. ఎన్టీఆర్ కోసం అనుకున్న కథలోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడని..

Guntur Kaaram : గుంటూరు కారం మూవీకి మొదటి హీరో మహేష్ కాదట.. ఎన్టీఆర్ అంటా.. నిజమెంత..!

Guntur Kaaram movie first choice is NTR instead of Mahesh Babu

Updated On : July 26, 2023 / 3:47 PM IST

Guntur Kaaram : టాలీవుడ్‌లో గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్‌ మరే సినిమాపై వచ్చివుండవు. సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేశాయి. అన్నిటికి మించి అసలు గుంటూరు కారం సినిమాలో హీరో సూపర్ స్టార్ మహేశే కాదని… జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం అనుకున్న కథలో మహేశ్‌ అనుకోకుండా యాక్ట్‌ చేశారని తాజాగా రూమర్స్‌ వస్తున్నాయి. ఈ న్యూస్‌లో నిజమెంత? గుంటూరు కారంలో ఇన్ని మసాలాలు ఉన్నాయా..?

Bholaa Shankar : మెగాస్టార్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాపవర్ స్టార్.. టైం తెలుసా..?

ఇన్నాళ్లు ఎన్నో రూమర్స్‌కు వేదికైన మహేశ్ సినిమా గుంటూరు కారం సినిమా.. తాజాగా మరో పెద్ద టాపిక్‌కు కేంద్రంగా మారింది. అసలు గుంటూరు కారం సినిమా కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దని లేటెస్ట్ టాక్. జూనియర్‌ ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకోని త్రివిక్రమ్ ఈ కథ రాయటంతోపాటు.. ఆ యాంగిల్‌లోనే టెక్నీషియన్స్ ని కూడా తీసుకున్నారట. ఐతే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో బిజీగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమాకు హీరోగా మహేశ్‌ను తీసుకున్నారని టాలీవుడ్ టాక్.

ఇలా ఓ కథానాయకుడి కోసం రాసిన కథలో ఇంకో హీరో నటించడంతోనే సమస్య వచ్చిందని టాలీవుడ్ వర్గాల భోగట్టా. మాస్ హీరో ఇమేజ్‌తో ఎన్టీఆర్ కోసం కథరాస్తే క్లాస్ హీరోతో తెరకెక్కించాల్సి రావడంతో కథతో పాటు టెక్నీషియన్స్, ఆర్టిస్టులను మార్చాల్సివచ్చిందని. మొత్తంగా స్టోరీ లైనే మారిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఒక వైపు షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు మార్పులు చేర్పులు చేయడంతో ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలిచింది.

Ram Charan : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో చెప్పిన తేజ్.. కళ్ళు చాలా బాగున్నాయి..

ఎన్టీఆర్‌ది మాస్ అప్పిరియన్స్ అయితే మహేశ్‌ది క్లాస్ అప్పిరియన్స్.. ఈ తేడాతో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందట. ఫస్ట్ తమిళ్ యాక్షన్ డైరెక్టర్స్ గా అన్బూ, అరివ్‌ను సెలెక్ట్ చేశారు. మహేశ్‌ వీరితో కాకుండా రామ్ లక్ష్మణ్‌లను తీసుకున్నారని చెబుతున్నారు. అలా మొదలైన మార్పులు చాలా రకాలుగా జరిగాయని అంటున్నారు. మరో వైపు త్రివిక్రమ్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో మహేశ్ కి అసలు నచ్చటం లేదంటున్నారు. తర్వాత హీరోయిన్ విషయంలోనూ ఎన్నో మార్పులు జరిగాయి. ముందుగా పూజా హెగ్డేని అనుకున్నా. ఆమె అందుబాటులో లేకపోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక తమన్ మ్యూజిక్ ట్రాక్స్ కూడా మహేశ్ కు నచ్చలేదని, తమన్ స్థానంలో ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ని తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఫస్ట్ కెమెరామెన్ పీఎస్ వినోద్ కూడా వెళ్ళిపోయాడు. అతని ప్లేస్ లో రవి కే చంద్రన్ వచ్చాడు. తమన్ విషయంలో మాత్రం సినిమా యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చేదాక మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారని అంటున్నారు. ఈవిధంగా ఓ హీరో కోసం అనుకున్న కథలో అనుకోకుండా మరో హీరో ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నో రకాల టర్నింగ్‌లు తీసుకుంటోంది గుంటూరు కారం మూవీ.