Bholaa Shankar : మెగాస్టార్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాపవర్ స్టార్.. టైం తెలుసా..?
భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ కి టైం కూడా ఫిక్స్ అయ్యిపోయింది. ఇక ఈ మెగాస్టార్ మూవీ ట్రైలర్ ని మెగాపవర్ స్టార్ రిలీజ్ చేయబోతున్నాడు.

Chiranjeevi Bholaa Shankar trailer will be released by Ram Charan
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) మరోసారి జంటగా కనిపిస్తూ చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతూనే, మరో పక్క ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
Ram Charan : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో చెప్పిన తేజ్.. కళ్ళు చాలా బాగున్నాయి..
రేపు జులై 27న ఈ మూవీ ట్రైలర్ ని సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రిలీజ్ చేయబోతున్నాడు. మరి ట్రైలర్ లో భోళా మ్యానియా ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ మూవీ వస్తుండడంతో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇక వాల్తేరు వీరయ్యలో గోదావరి యాసతో అదరగొట్టిన చిరు.. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో అలరించబోతున్నాడు.
Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక మూలన కూర్చుని ఏడ్చా..
The Bholaa Mania gets Bigger & Mega Powerful ?
Global Star @AlwaysRamCharan
to Launch Mega ? @KChiruTweets #BholaaShankar Trailer Tomorrow at 4:05 PM ❤️?Stay tuned ?
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati… pic.twitter.com/Mm3woabQ4p
— AK Entertainments (@AKentsOfficial) July 26, 2023
అంతేకాదు ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నాడు. ఇక ఖుషీ మూవీలోని ఐకానిక్ నడుము సీన్ చిరు స్పూఫ్ చేసి నవ్వించబోతున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ మూవీలో సుశాంత్, రేష్మి, శ్రీముఖి, రఘుబాబు, మురళి శర్మ, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.