SRK’s Son : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు..వాదించే క్రిమినల్ లాయర్ ఎవరు ?

ఆర్యన్ తరపున వాదించేందుకు క్రిమినల్ లాయర్ గా పేరొందిన సతీష్ మానెషిండేకు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు వాదించే బాధ్యతను అప్పచెప్పారని తెలుస్తోంది.

SRK’s Son : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు..వాదించే క్రిమినల్ లాయర్ ఎవరు ?

Aryan Drug

Aryan Khan In Drugs Case : బాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అతను డ్రగ్స్ వాడాడా ? లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. రేవ్ పార్టీ ఎవరు జరిపించారు ? దీని వెనుక ఎవరున్నారనే అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ సమయంలో…ఆర్యన్ ఖాన్ ఏడ్చినట్లు తెలుస్తోంది. షారూక్ ఖాన్ ..ఆర్యన్ కు ఫోన్ చేశారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఆర్యన్ కు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Read More : Drug Case : ఏడుస్తున్న ఆర్యన్, ఫోన్ చేసిన షారూక్..చట్టం ఏం చెబుతోంది ?

తాజాగా ఆర్యన్ తరపున వాదించేందుకు క్రిమినల్ లాయర్ గా పేరొందిన సతీష్ మానెషిండేకు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు వాదించే బాధ్యతను అప్పచెప్పారని తెలుస్తోంది. ఈయన రామ్ జెఠ్మాలనీ వద్ద పనిచేశారు. బాలీవుడ్ కు చెందిన చాలా హై ప్రోఫైల్ కేసులను సతీష్ మానెషిండే వాదించారు. ఇటీవలే మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి తరపున ఈ వాదిస్తున్నారు. కోర్టులో పలు వాదనలు వినిపించారు. ఇక 2002 బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా సతీషే వాదించారు.

Read More : SRK’s Son Aryan : క్రూయిజ్ డ్రగ్స్ కేసు, ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

1998లో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఇరుక్కున్నారు. ఈ కేసులో సల్మాన్ తరపున వాదనలు వినిపించారు. మరీ ప్రధానంగా 1993లో ముంబాయి బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి నటుడు సంజయ్ దత్ తరపున వాదించి…బెయిల్ వచ్చే విధంగా చేశారు. ఆయుధ చట్టం కింద సంజయ్ పై పెట్టిన కేసును కూడా ఆయనే వాదించారు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కేసులో వాదించేందుకు సతీష్ సిద్ధమయ్యారని సమాచారం. ఆర్యన్ వద్ద ఎలాంటి నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకోలేదని..ఆయన కోర్టులో వెల్లడించారని తెలుస్తోంది. మరి ఈ కేసులో ఆర్యన్ కు బెయిల్ వచ్చే విధంగా సతీష్ ఎలాంటి వాదనలు వినిపిస్తారో చూడాలి.