Suhsmitha Konidela : నిర్మాతగా నాన్నతో సినిమా తీయాలని ఉంది.. నాన్నకి చెప్తే..

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్యకి వింటేజ్ లుక్ కావాలంటే ఫిషర్ మ్యాన్ కి తగ్గట్టు, ఇప్పటి ట్రెండ్ కూడా జత చేసి కాస్తూమ్స్ డిజైన్ చేశాను. అలాగే నాన్న గారి ‘బోళా శంకర్‌’ సినిమాకి కూడా డిజైన్‌ చేస్తున్నాను. ఇక మా నిర్మాణంలో.............

Suhsmitha Konidela : నిర్మాతగా నాన్నతో సినిమా తీయాలని ఉంది.. నాన్నకి చెప్తే..

Suhsmitha Konidela wants to produce for chiranjeevi movie

Suhsmitha Konidela :  ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో కమర్షియల్ విజయం సాధించి సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ సినిమాకి ఫ్యాషన్ డిజైనర్ గా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల వర్క్ చేసింది. చిరంజీవి కూతురుగా సుస్మిత పాపులర్ అయినా సినీ పరిశ్రమలో మాత్రం ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుస్మిత ఇటీవల చిరంజీవి అన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది.

ఓ పక్క కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే మరోపక్క తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది. ఇప్పటికే సుస్మిత నిర్మాణంలో తెరకెక్కిన సిరీస్ లు రిలీజయ్యాయి కూడా. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Veerasimha Reddy : టర్కీలో వీరసింహారెడ్డి యూనిట్ పై పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చిన స్థానికులు..

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్యకి వింటేజ్ లుక్ కావాలంటే ఫిషర్ మ్యాన్ కి తగ్గట్టు, ఇప్పటి ట్రెండ్ కూడా జత చేసి కాస్తూమ్స్ డిజైన్ చేశాను. అలాగే నాన్న గారి ‘బోళా శంకర్‌’ సినిమాకి కూడా డిజైన్‌ చేస్తున్నాను. ఇక మా నిర్మాణంలో ప్రస్తుతం రెండు వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నాము. అంతేకాక మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. నా నిర్మాణంలో మా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో నాన్నతో సినిమా చేయాలని ఉంది. ఇదే విషయాన్ని నాన్నకి చెప్తే అందరి నిర్మాతలకి చెప్పినట్టే మంచి కథతో రా అని మాకు కూడా చెప్పారు. మేం కూడా నాన్నకి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాం అని తెలిపింది. ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాణంలో సినిమాలు తీశారు. ఇప్పుడు కూతురు సుస్మిత నిర్మాణంలో సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి మరి.