శిష్యుడికి సుకుమార్ అభినందన.. లెటర్ వైరల్..

శిష్యుడికి సుకుమార్ అభినందన.. లెటర్ వైరల్..

Sukumar: పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. ఫిబ్రవరి 12న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Uppena

సరికొత్త కథ, కథనాలతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు ఎమోషనల్‌గా తెరకెక్కించాడంటూ సినీ ఇండస్ట్రీ వారు సైతం ప్రశంసిస్తున్నారు. తాజాగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడిని అభినందిస్తూ ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. గురువుగా ఆయన ఆనందాన్ని తన స్టైల్లో చెప్పారు సుకుమార్.

Uppena

‘‘నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’ బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు
సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్’’ .. అంటూ సుకుమార్ తన బుచ్చిబాబుని అభినందిస్తూ పోస్ట్ చేసిన ఈ లెటర్ వైరల్ అవుతోంది.

Sukumar