Sumanth : సూపర్‌స్టార్ సినిమాలో సుమంత్..!

మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో యంగ్ హీరో సుమంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు సోసల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..

Sumanth : సూపర్‌స్టార్ సినిమాలో సుమంత్..!

Sumanth Key Role In Mahesh Babu Trivikram Movie

Updated On : May 14, 2021 / 11:30 AM IST

Sumanth: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడో మూవీ ఇది.. త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత ఎస్. రాధ కృష్ణ (చినబాబు) హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, 2022 వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని వీడియో ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే..

Ssmb 28

ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో సుమంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు సోసల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘యువకుడు’, ‘సత్యం’, ‘గౌరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీరావా’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజగత్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నారు సుమంత్.. ప్రస్తుతం ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా చేస్తున్నారు.

Sumanth

అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ సినిమాలో సుశాంత్‌కు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు సూపర్‌స్టార్ సినిమాలో సుమంత్ చేత ఓ కీ రోల్ చేయించనున్నారని సమాచారం. హీరో తర్వాత సినిమాలో సుమంత్ క్యారెక్టర్ హైలెట్ అవనుందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే..

Anaganaga Oka Rowdy