Micheal Review : పాత కథకి KGF ఎలివేషన్స్ జోడించిన మైఖేల్..

మైఖేల్.. సందీప్ కిషన్ వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకొని వచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్.. ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని...........

Micheal Review : పాత కథకి KGF ఎలివేషన్స్ జోడించిన మైఖేల్..

Sundeep Kishan Micheal Movie Review

Micheal Review :  మైఖేల్.. సందీప్ కిషన్ వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకొని వచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్.. ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని తెరకెక్కించారు. మైఖేల్ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ కి ముందు తెలుగు, తమిళ్ లో ప్రమోషన్స్ బాగానే చేశారు.

కథ విషయానికొస్తే అనాథగా(సందీప్ కిషన్) వచ్చిన ఓ అబ్బాయి ఓ పెద్ద డాన్(గౌతమ్ మీనన్) దగ్గరకు చేరి అక్కడున్న ఓ వ్యక్తి దగ్గర పెరుగుతాడు. పెద్దయ్యాక ఆ డాన్ ని పెద్ద ఫైట్ లోంచి హీరో మైఖేల్ కాపాడటంతో అతని మీద నమ్మకం వచ్చి మెల్లిమెల్లిగా పనులు చెప్తాడు. ఇది ఆ డాన్ కొడుకు (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ)కి నచ్చదు. ఒకర్ని చంపి రమ్మని డాన్ సందీప్ కిషన్ ని పంపిస్తే అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి చంపకపోవడంతో ఇదే టైం అనుకోని డాన్ కొడుకు సందీప్ కిషన్ ని చంపేసి పడేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. అయితే సందీప్ చావకుండా బతికి ఉండటంతో తిరిగి ఎలా వచ్చాడు? ఎవరిమీద రివెంజ్ తీర్చుకున్నాడు? ఎవర్ని చంపేశాడు? ఆ అమ్మాయి ఏమైంది? విజయ్ సేతుపతికి, సందీప్ కిషన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా కథనం మొత్తం కూడా KGF స్టైల్ లో నెరేషన్, ఎలివేషన్స్ తో సాగుతుంది. కథ చూస్తే పంజా, బాలు లాంటి కథే కాకపోతే సెకండ్ హాఫ్ లో ఓ రెండు ట్విస్ట్ లు రివీల్ చేస్తాడు. కానీ ఆ ట్విస్ట్ లు ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. దీంతో ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి అనిపిస్తుంది. ఇటీవల ఎక్కువగా ఇలాంటి డాన్ సినిమాలు వస్తున్నాయి. కానీ సందీప్ బాడీకి ఈ సినిమా అస్సలు సూట్ అవ్వలేదు. కొన్ని చోట్ల సందీప్ కి మరీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు అనిపిస్తుంది. సందీప్ ఈ సినిమా కోసం కొంచెం బాడీ మీద కూడా ఫోకస్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది. ఇక కథ 90s బ్యాక్ డ్రాప్ లో సాగడం, స్లో నెరేషన్ కావడం వల్ల కొంతమందికి సినిమా త్వరగా ఎక్కదు. సినిమా కలర్ టెక్నిక్స్ అంతా డార్క్ లో వెరైటీగా వాడటంతో కొన్ని చోట్ల కలర్ సెట్టింగ్స్ అంతగా సెట్ అవ్వలేదు. సినిమాలో ఒకేఒక పాట మెలోడీ బాగుంటుంది. యాక్షన్ సీన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు.

ఇంతమంది క్యాస్టింగ్ ని పెట్టుకున్నా ఎవర్ని సరిగ్గా వాడుకోలేదనే చెప్పొచ్చు. వరలక్షి శరత్ కుమార్ ఒక 5 నిముషాలు కనిపిస్తుంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. విజయ్ సేతుపతికి తెలుగులోనూ అభిమానులుండటంతో ఈ క్యారెక్టర్, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ బాగా పనిచేస్తాయి. గౌతమ్ మీనన్ డాన్ గా పర్వాలేదనిపించాడు. అనసూయ కూడా పర్వాలేదనిపించింది. బాగా డబ్బున్న వాడి కొడుకుగా వరుణ్ సందేశ్ క్యారెక్టర్ బానే ఉన్నా వరుణ్ కి సూట్ అవ్వలేదనిపిస్తుంది. ఇక హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది. కాకపోతే తను ఒక డ్యాన్సర్ అని చూపించాడు, కానీ ఆమె డ్యాన్స్ వేస్తుంటే ఆమెకు డ్యాన్స్ రాదని తెలిసిపోతుంది. లేదా అదేమన్నా కొత్తరకం డ్యాన్స్ అయినా అయి ఉండాలి. ఇక కామెడీ సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ పంజా సినిమానే గుర్తుకు వస్తుంది. ఒక్క క్లైమాక్స్ తప్ప. దీంతో ఇలాంటి స్టోరీలో పవన్ లాంటి స్టార్ హీరోని చూసి సందీప్ ని చూడమంటే కొంచెం కష్టమే. సందీప్ కిషన్ కి సెట్ అయ్యే స్టోరీ అయితే కాదు ఇది.

Shahrukh Khan : షారుఖ్‌ని టామ్‌క్రూజ్ తో పోల్చిన హాలీవుడ్ జర్నలిస్ట్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

సినిమాకి ఉన్న ఒకేఒక్క ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సామ్ CS ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ఇలాంటి సినిమాకి ఇలాగే ఇవ్వాలి మ్యూజిక్ అన్నంతగా బాగా ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమా నిలబడింది అని చెప్పొచ్చు. సినిమాలో సైలెంట్ గా ఉండే సన్నివేశాల్లో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా పనిచేసింది. సినిమా భారీ విజయం సాధించకపోయినా ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి గ్యాంగ్ స్టర్ సినిమాలు ఎక్కువగా వస్తుండటం, ఈ సినిమాని తమిళ్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రిలీజ్ చేయడం, స్టార్ క్యాస్ట్, హీరోయిన్ తో రొమాన్స్.. ఇలాంటి వాటి వల్ల అయినా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

*ఈ రివ్యూ కేవలం మా అభిప్రాయం మాత్రమే..