Bunny Vasu: నిర్మాత బన్నీవాసును వేధించిన అమ్మాయి అరెస్ట్

యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసును వీడని నీడలా వెంటాడుతున్న, వేదిస్తున్న సునీత బోయ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు.

Bunny Vasu: నిర్మాత బన్నీవాసును వేధించిన అమ్మాయి అరెస్ట్

Bunny Vasu Geetha Arts office: యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసును వీడని నీడలా వెంటాడుతున్న, వేదిస్తున్న సునీత బోయ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు. మూడేళ్లుగా ఫేస్ బుక్‌లోనూ, బయట కూడా అతనెక్కడ ఉంటే, అక్కడ ప్రత్యక్షమై వేదిస్తున్న సునీత బోయ అనే అమ్మాయి, లేటెస్ట్‌గా తనకు అవకాశం ఇస్తానంటూ బన్నీవాసు మోసం చేశాడంటూ అభియోగిస్తూ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర హల్ చల్ చేసి చివరకు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తానంటూ బెదిరించింది.

బన్నీవాసు ఆపీస్ వాళ్లు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరిస్తున్నాడంటూ ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్‌‌లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద సునీత బోయ ఈ చర్యకు పాల్పడింది. మలక్‌పేట ప్రాంతంలో కొంతకాలంగా పుచ్చకాయలు అమ్ముకునే సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో కొందరితో సంబంధాలు ఉండేవి. గతంలో దివంగత కత్తిమహేష్‌పై కూడా సునీత బోయ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న సునీత బోయ, పలుమార్లు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి న్యూసెన్స్‌ చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా రెండు కేసుల్లో జైలుకు కూడా వెళ్లింది. ఆమె కూడా పలుమార్లు బన్నీవాసుపై కేసులు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.