సూపర్‌హిట్ ‘సూపర్ డీలక్స్’ తెలుగులో..

సూపర్‌హిట్ ‘సూపర్ డీలక్స్’ తెలుగులో..

Updated On : February 22, 2021 / 6:56 PM IST

Super Deluxe: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్న తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సూపర్ డీలక్స్’.. ‘శివగామి’ రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ ఫాజల్ కీలకపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Vijay Sethupathi

‘సైరా’ లో పాండిరాజ్ క్యారెక్టర్‌తో తెలుగు తెరకు పరిచయం అయిన విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ తో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజయ్ క్రేజ్ దృష్ట్యా ‘సూపర్ డీలక్స్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సిద్ధేశ్వర వైష్ణవి ఫిలింస్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి ఈ సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకుంది.

Super Deluxe

దర్శకుడు మిస్కిన్, గాయత్రి అయ్యర్, మృణాళిని రవి తదితరులు నటించిన ‘సూపర్ డీలక్స్’ పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, వివిధ కేటగిరీలలో అవార్డులు గెలుచుకుంది. యువన్ శంకర్ రాజా సంగీత మందించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది..

Ramya Krishna