Adani-Hindenburg Row: అదాని, హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు.. సెబీ, కేంద్రానికి కీల‌క సూచ‌న‌లు

ఇన్వెస్ట‌ర్ల సొమ్మును ర‌క్షించాలంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో చెప్పాల‌ని కేంద్రాన్ని, సెబీని సుప్రీంకోర్టు కోరింది. నిపుణులతో కమిటి వేస్తే బావుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డిన ఉన్న‌త న్యాయ‌స్థానం.. ఈ మేర‌కు సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. విచార‌ణ‌ను 13వ తేదీకి వాయిదా వేసింది.

Adani-Hindenburg Row: అదాని, హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు.. సెబీ, కేంద్రానికి కీల‌క సూచ‌న‌లు

Suprem court

Adani-Hindenburg Row: అదానీ గ్రూప్స్ పై అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ నివేదిక త‌రువాత స్టాక్ మార్కెట్ల‌లో ఆ గ్రూప్ షేర్లు భారీగా ప‌డిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్‌ల‌లో అదానీ గ్రూప్‌పై పెట్టుబ‌డులు పెట్టిన వేలాది మంది భార‌తీయులు రూ. ల‌క్ష‌ల కోట్లు న‌ష్టాన్ని చ‌విచూశారు. అదానీ గ్రూపు వ్య‌వ‌హారం పార్ల‌మెంట్‌ను కుదిపేస్తుంది. ఈ క్ర‌మంలో అదాని, హిండెన్ బర్గ్ నివేదిక వివాదం పై సుప్రీంకోర్టులో శుక్ర‌వారం విచారణ జ‌రిగింది. అదానీ, హిండెన్ బ‌ర్గ్ వివాదంపై జోక్యం చేసుకోవాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటీష‌న్ దాఖ‌లు కావ‌టంతో సుప్రీంకోర్టు దీనిపై విచార‌ణ జ‌రిపింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం విచార‌ణ జ‌రప‌గా.. ఇన్వెస్టర్ల భద్రత పై ఆందోళన వ్య‌క్తం చేశారు.

Adani Group: హిండెన్‌బర్గ్‭తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ

ఇన్వెస్ట‌ర్ల సొమ్మును ర‌క్షించాలంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో చెప్పాల‌ని కేంద్రాన్ని, సెబీని కోరింది. నిపుణులతో కమిటి వేస్తే బావుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డిన సుప్రీంకోర్టు.. ఈ మేర‌కు సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరల పతనం కారణంగా భారతీయ పెట్టుబడిదారులు అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టపోయార‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ క్ర‌మంలో భారతీయ పెట్టుబడిదారులను రక్షించడానికి చర్యలు తీసుకోవచ్చా? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలియ‌జేయాల‌ని సెబిని సుప్రీంకోర్టు కోరింది.

Adani Hindenburg Row : అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్, హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు గ్రీన్‌సిగ్నల్

భారత పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్టమైన యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చో వివరిస్తూ వచ్చే సోమవారంలోగా వివరణ ఇవ్వాలని సెబీని సుప్రీంకోర్టు కోరింది. ఇప్పటికే ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, సంబంధిత కారణ కారకాలు, పెట్టుబడిదారులను రక్షించడానికి బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు అంశాలపై సెబీని వివరణ కోరిన సుప్రీంకోర్టు, సెబీ సూచనలను ఆమోదించడానికి కేంద్రం సిద్దంగా ఉంటే కమిటీని సిఫార్సు చేయవచ్చ‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అయితే ఈ అంశంపై కేంద్రం వైఖ‌రి ఏమిటో సోమ‌వారం (ఈనెల 13న‌) త‌దుప‌రి విచార‌ణ స‌మ‌యంలో తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? విధి విధానాలు ఎలా ఉండాల‌న్న అంశంపై కేంద్రం, సెబీలు త‌మ వైఖ‌రిని తదుప‌రి విచార‌ణ‌లో తెలిపేలా చూడాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాను ధ‌ర్మాసంన ఆదేశించింది.