మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. తేజ్ ప్రారంభించిన అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డేజ్ హోమ్..

మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు.. తేజ్ ప్రారంభించిన అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డేజ్ హోమ్..

Sai Tej: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్‌మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాట ప్రకారం ఇచ్చిన హామీ నెరవేర్చాడు.

TEJ

వివరాళ్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆదరణ సేవాసంస్థ వృద్ధాశ్రమం తమ ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి సాయం చేయాలని తేజ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజు నాడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులకు ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించగా వారందరూ బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్ వంటివి చేయకుండా ఆ డబ్బుతో తమవంతు సాయమందించారు.

https://10tv.in/supreme-hero-sai-dharam-tej-fulfills-his-promise/

TEJ

అలాగే బిల్డింగ్ పూర్తి చేయడంతో పాటు ఒక సంవత్సరం వరకు ఆ ఓల్డేజ్ హోమ్‌కు తాను స్పాన్సర్ షిప్ అందిస్తున్నట్లు చెప్పాడు సాయి.. అన్నట్లుగానే సంవత్సరం కల్లా అమ్మ ప్రేమ ఆదరణ సేవా వృద్ధాశ్రమం రెండు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా ఆ బిల్డింగ్ తేజ్ చేతులమీదుగా ప్రారంభమైంది.

TEJ

ఏ దిక్కూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించిన సాయి ధరమ్ తేజ్‌కు ఓల్డేజ్ హోమ్ వారు, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, మెగాభిమానులు, నెటిజన్లు చాలా మంచి పని చేశారంటూ తేజ్‌ను అభినందిస్తున్నారు.

TEJ