Suresh Raina : రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టిన చిన్న త‌లా.. యూర‌ప్ న‌డిబొడ్డున.. స్వ‌యంగా వంట చేసిన రైనా

టీమ్ఇండియా త‌రుపున ఆడినా, ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించినా త‌న‌దైన డాషింగ్ బ్యాటింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌తో అభిమానుల‌కు అల‌రించాడు సురేశ్ రైనా. క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు ప‌లికిన రైనా బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.

Suresh Raina : రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టిన చిన్న త‌లా.. యూర‌ప్ న‌డిబొడ్డున.. స్వ‌యంగా వంట చేసిన రైనా

Raina Indian Restaurant

Raina Indian Restaurant : టీమ్ఇండియా త‌రుపున ఆడినా, ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించినా త‌న‌దైన డాషింగ్ బ్యాటింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌తో అభిమానుల‌కు అల‌రించాడు సురేశ్ రైనా (Suresh Raina) . ఇక చెన్నై అభిమానులంతా ముద్దుగా చిన్న త‌లా అని పిలుస్తుంటారు. క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు ప‌లికిన రైనా బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన హోట‌ల్ బిజినెస్‌.

యూర‌ప్ న‌డిబొడ్డున ఉన్న నెద‌ర్లాండ్స్(Netherlands) రాజ‌ధాని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam)లో ఇండియ‌న్‌ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. దీనికి ‘రైనా ఎస్ ఆర్’ అనే పేరు పెట్టాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ రెస్టారెంట్ ద్వారా రైనా ఆ దేశం వారికి ఇండియ‌న్ వంట‌కాల రుచుల‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నాడు.

WI vs IND : పుజారా ఔట్‌.. జైశ్వాల్ ఇన్‌.. సంజు శాంస‌న్‌కు చోటు.. వెస్టిండీస్ టూర్‌కు భార‌త వ‌న్డే, టెస్టు జ‌ట్లు ఇవే

ఇక రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రైనా స్వ‌యంగా వంట కూడా చేశాడు. రైనా భోజ‌న ప్రియుడు మాత్ర‌మే కాదు మంచి చెఫ్ అన్న సంగ‌తి తెలిసిందే. ‘రైనా ఇండియన్ రెస్టారెంట్‌ను పరిచయం చేయడాన్ని ఎంతో ఆనందిస్తున్నాను. ఇక్కడ ఆహారం, వంటలు అభిరుచికి ప్రాధాన్యతనిస్తుంది. భార‌త్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎన్నో రుచుకుల‌ను ఇక్క‌డ నా రెస్టారెంట్ ద్వారా స్థానిక ప్ర‌జ‌ల‌కు చూపిస్తాను. ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన మ‌సాలా వంట‌కాలు, ద‌క్షిణ భార‌త దేశానికి చెందిన ఘుమ ఘుమ లు నోరూరించేలా ఉంటాయి. ‘అంటూ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

Mitchell Starc : భార్య ఆట‌ను చూడాల‌ని వ‌చ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌.. నిరాశ త‌ప్ప‌లేదుగా

రైనా రెస్టారెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Kl Rahul : కేఎల్ రాహుల్ వ‌ర్కౌట్లు .. ఇషాన్ కిష‌న్ కామెంట్ వైర‌ల్‌.. ‘మిస్ట‌ర్ ర‌జినీ ఎందుకు అంత ఎక్స్ ట్రా..’

టీమ్ఇండియా త‌రుపున సురేశ్ రైనా 18 టెస్టుల్లో ఓ సెంచ‌రీ 7 అర్థ‌శ‌త‌కాల‌తో 768 ప‌రుగులు, 226 వ‌న్డేల్లో 5 శ‌త‌కాలు, 36 అర్ధ‌శ‌త‌కాల‌తో 5,615 ప‌రుగులు, 78 టీ20ల్లో ఓ సెంచ‌రీ 5 అర్ధ‌శ‌త‌కాల‌తో 1,605 ప‌రుగులు చేశాడు. 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్ల‌లో రైనా స‌భ్యుడు. ఇక 2010లో ద‌క్షిణాఫ్రికాపై సెంచ‌రీ చేసి ఐసీసీ పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ‌త‌కం చేసిన మొద‌టి భార‌త ఆట‌గాడిగా రైనా నిలిచాడు. 15 ఆగ‌స్టు 2020న రైనా అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయ్యాడు.

ఇక ఐపీఎల్‌లో 200 మ్యాచులు ఆడి ఓ సెంచ‌రీ 39 అర్ధ‌శ‌త‌కాల‌తో 5,528 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఎక్కువ‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున‌నే ఆడాడు. 6 సెప్టెంబ‌ర్ 2022న అన్ని ర‌కాల క్రికెట్‌కు రైనా వీడ్కోలు ప‌లికాడు. తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.