Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా మాధవన్ షూటింగ్ సమయంలోని ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో సూర్య షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టి మాధవన్ ని నంబి నారాయణ్ గెటప్ లో చూసి...........

Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..

Suriya

Updated On : June 29, 2022 / 7:16 AM IST

Madhavan :  హీరోగా, విలన్ గా ఎన్నో పాత్రలు చేసిన మాధవన్ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాధవన్ రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మాధవన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా సూర్య, షారుఖ్ ఓ రెండు పాత్రల కోసం నటించనున్నారు. ఈ సినిమా జులై 1 న విడుదల కానుంది.

ఈ సినిమాలో అచ్చం నంబి నారాయణ్‌లా కనిపించడానికి మాధవన్ చాలా కష్టపడ్డాడు. తెల్ల జుట్టు, గడ్డం, కళ్లద్దాలతో, కొంచెం లావుగా తనని తాను మేకోవర్ చేసుకున్నాడు మాధవన్. ఈ సినిమాని మాధవన్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మాధవన్ షూటింగ్ సమయంలోని ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో సూర్య షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టి మాధవన్ ని నంబి నారాయణ్ గెటప్ లో చూసి ఆశ్చర్యపోయారు. గెటప్ తో మాధవన్, రియల్ నంబి నారాయణ్ పక్కపక్కనే ఉండటంతో ఒక్క క్షణం ఎవరు నిజమైన నంబి నారాయణ్‌ అని గుర్తు పట్టలేదనేంతగా షాక్ అయ్యాడు సూర్య.

Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

సూర్యని మాధవన్ నారాయణ్‌ కి పరిచయం చేయగా ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయి. మీ నటన కూడా బాగుంటుంది, మీ నాన్నగారి సినిమాలు నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఈ వీడియోలో సూర్య ఆశ్చర్యపోవడంతో ఇది వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో నటించడానికి సూర్య, షారుఖ్ రెమ్యునరేషన్ తీసుకోకపోవడం విశేషం. ఇందులో నంబి నారాయణ్‌ భార్య పాత్రలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ కనిపించబోతుంది.

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)