Ketika Sharma: క్యూ కడుతున్న ఆఫర్లు.. ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా కేతికా!

అనుష్క, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్స్ పెద్దగా స్వింగులో లేరు. పూజా హెగ్డే, రష్మిక మందనా లాంటి వారు ఫుల్ బిజీగా ఉన్నారు.. దానికి తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పాల్సి..

Ketika Sharma: క్యూ కడుతున్న ఆఫర్లు.. ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా కేతికా!

Ketika Sharma

Ketika Sharma: అనుష్క, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్స్ పెద్దగా స్వింగులో లేరు. పూజా హెగ్డే, రష్మిక మందనా లాంటి వారు ఫుల్ బిజీగా ఉన్నారు.. దానికి తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే టాలీవుడ్ లో ఓ మోస్తరు సినిమాలకు హీరోయిన్స్ దొరకడం లేదు. అందుకే ఇప్పుడు మేకర్స్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే భామల మీద కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. అలాంటి వారి చూపు ఇప్పుడు రొమాంటిక్ పిల్ల మీద పడింది.

Ketika Sharma: అందం అమ్మాయైతే కేతికలా ఉంటుందేమో!

ఒకే ఒక్క ‘థగ్‌ లైఫ్‌ (2016)’ వీడియోతో పాపులర్‌ అయ్యిన కేతిక.. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకున్న కేతికకి ఇప్పుడు వరస అవకాశాలను తెచ్చిపెడుతుంది. ‘రొమాంటిక్‌’లో ఆకాశ్‌ పూరితో జతకట్టిన ఈ భామ హద్దులు దాటేసి మరీ అందాలు ఆరబోసింది. సినిమా ఫస్ట్‌లుక్‌తోనే సమ్ థింగ్ స్పెషల్ అనిపించేసుకున్న కేతిక సినిమా విడుదల తర్వాత కెవ్వు కేతిక అనిపించుకుంది.

Ketika Sharma:’రొమాంటిక్’ ట్రీట్.. కేతిక అందాలు అదరహో!

కాలేజీ ఫ్యాషన్ షోల నుండి ఫోటో షూట్ల వరకు తనకు మించిన హాట్ లేదనిపించుకున్న ఈ ఉత్తరాది ఊర్వశి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కోసం పెద్దగా హద్దులేమీ పెట్టుకోకపోవడంతో నిర్మాతలు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే కేతికకు రామ్ పోతినేనితో ఓ అఫర్ కొట్టేసినట్లు టాక్ నడుస్తుండగా.. ఇప్పుడు వరసగా నాగశౌర్య, వైష్ణవ్‌ తేజ్‌ సినిమాల కోసం లాక్ చేసినట్లు వినిపిస్తుంది. మొత్తం కుర్ర హీరోలకు కేతిక ఇప్పుడు ది బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. మరి ఇందులో ఒక్కటి కలిసొచ్చినా కేతికాకు ఇంకా అడ్డే ఉండదేమో!