Heavy Rains : తమిళనాడులో గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వానలు

తమిళనాడులో 17 జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. 12 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు 10 వేల ఇళ్లు నీట మునిగాయి.

Heavy Rains : తమిళనాడులో గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వానలు

Tamilnadu Rain

Tamil Nadu Heavy Rains : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా వర్షం దంచికొడుతుండటంతో.. చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, శివగంగ, దిండిగుల్‌, మధురైలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇక తమిళనాడులో వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్ ప్రకటించారు. వరద బాధితుల కోసం మొత్తం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Read More : AP Floods : వరదలు, కేంద్ర బృందం పర్యటన..ఫస్ట్ డే

కేప్‌ కొమోరిన్, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని.. దీని ప్రభావంతో తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతోపాటు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెదర్ అలర్ట్ ఇచ్చింది.

Read More : Corona New Variant: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్రమత్తం

తమిళనాడులో 17 జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. 12 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు 10 వేల ఇళ్లు నీట మునిగాయి. బాధితులను రెస్క్యూ టీమ్స్‌ రక్షిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లు చెరువులను, రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కన్నియాకుమారి జిల్లాలో కురిసిన వర్షాలకు 12 గిరిజన గ్రామాలు దీవులను తలపిస్తున్నాయి. 27 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.