కంపెనీ ఓనర్ పైత్యం..లేడిస్ టాయిలెట్‌లో సీసీటీవీ కెమెరా..

కంపెనీ ఓనర్ పైత్యం..లేడిస్ టాయిలెట్‌లో సీసీటీవీ కెమెరా..

Tamil Nadu Web Designing firm owner cctv camera women toilet  : తమిళనాడులోకి కన్యాకుమారి జిల్లాలో ఓ కంపెనీ ఓనర్ పైత్యం తలకెక్కి ఆఫీసులోని లేడీస్ టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టాడు. అది చూసిన ఓ మహిళ షాక్ అయ్యింది. వెంటనే నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆఫీసులో జరిగిన విషయం చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కంపెనీ ఓనర్ ను అరెస్ట్ చేశారు.

పల్లివాలి ప్రాంతానికి చెందిన సంజు అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా ZThree Infotech పేరుతో వెబ్ డిజైనింగ్ సంస్థను నడుపుతున్నాడు. దాదాపు నెలన్నర క్రితం అతడు తన సంస్థ కార్యకలాపాలను నాగర్‌కోయిల్ ప్రాంతంలోకి కొత్త ఆఫీస్‌కు షిఫ్ట్ చేశాడు. అలా గత వారం రోజుల క్రితం కొత్త ఆఫీసులో పనులు మొదలు పెట్టాడు. ఈక్రమంలో పాత వర్క్ర్స్ తో పాటు కొత్త వర్క్ కోసం ముగ్గురు మహిళలను ఆఫీసులు అపాయింట్ చేశాడు.

కొత్త ఆఫీసులో రెండు (టాయిలెట్స్ ఉన్నాయి. ఒకటి పురుషులది కాగా, మరోకటి మహిళది. ఈక్రమంలో గత శుక్రవారం (జనవరి 29) ఉదయం కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ మహిళ ఆఫీసులోని టాయలెట్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఏదో తేడాగా కనిపించింది. ఎందుకైనా మంచిదని టాయిలెట్‌ అంతా పరిశీలనగా చూసింది.

అలా చూస్తున్న ఆమెకు ఓ చోట నలుపు రంగు కవర్ కనిపించింది. అక్కడ కవర్ పెట్టాల్సిన అవసరమేంటని అనుమానం వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో సీసీటీవీ కెమెరా కనిపించింది. ఒక్కసారిగా షాక్ తింది. చూసింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఏం జరిగేదో అనే భయంతో భయపడిపోయింది.

తరువాత బయటివారికి ఎటువంటి అనుమానం రాకుండా మెల్లగా బయటకు వచ్చింది. వెంటనే వెళ్లితే ఓనర్ కు అనుమానం వచస్తుందనే భయంతో సాయంత్రం వరకూ ఓపిగ్గా ఆఫీసులోనే ఉంది. అవసరం అయినా సరే టాయిలెట్ కుమాత్రం వెళ్లలదే. అలా సాయంత్రం కాగానే..ఆఫీసు నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఓనర్‌ సంజుపై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆఫీసుకు వచ్చి టాయ్ టెల్స్ లో ఉన్న సీసీ కెమెరాను చూసి సంజుని ప్రశ్నించారు.

దానికి సంజు ఉద్యోగులపై నిఘా పెట్టడానికే అలా చేశానని..వేరే ఉద్ధేశ్యంతో కాదంటూ రకరకాల కారణాలు చెప్పుకొచ్చాడు. అవేవీ సరిగా లేకపోవటంతో సంజును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.