Rajinikanth Political Entry : రాజకీయాల్లోకి తలైవా ? అభిమానులతో మీటింగ్

Rajani
Tamil superstar Rajinikanth : రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారన్నే ఊహాగానాలు మరోసారి ఊపందకున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులతో సమావేశం అవుతుండడం మళ్లీ చర్చలకు దారితీసింది. 2021, జూలై 12వ తేదీ సోమవారం జరగనున్న సమావేశానికి హాజరుకావలంటూ తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు తలైవా. గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన సూపర్ స్టార్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే మళ్లీ అభిమాన సంఘ నేతలను కలుస్తుండడంతో రజనీ రాజకీయ రంగప్రవేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Read More : MP Komatireddy : రేవంత్‌రెడ్డి చిన్నపిల్లాడు-కోమటిరెడ్డి
అయితే అభిమానులతో రజనీకాంత్ ఏం చర్చించనున్నారన్న దానిపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. వైద్య పరీక్షల కోసం గత జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మయో క్లినికల్ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. వచ్చి రావడంతోనే అభిమానులతో సమావేశానికి పిలుపునిచ్చారు రజనీ. రాజకీయాల్లోకి రాకూడదని తలైవా తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని అభిమానులు కోరే అవకాశం కనిపిస్తోంది.