Tata Power : దేశవ్యాప్తంగా హెచ్ పీసీఎల్ అవుట్ లెట్లలో టాటాపవర్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్స్

వాహనతయారీ రంగంలో ప్రముఖ సంస్ధగా ఉన్న టాటా సంస్ధ దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకోసం హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ హెచ్ పిసిఎల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Tata Power : దేశవ్యాప్తంగా హెచ్ పీసీఎల్ అవుట్ లెట్లలో టాటాపవర్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్స్

Tata (2)

Tata Power : పెరిగిన పెట్రల్, డీజిల్ ధరలతో దేశ వ్యాప్తంగా ద్విచక్రవాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. ప్రభుత్వ పరంగా వీటి కొనుగోలుకు ప్రత్యేకమైన రాయితీలు కూడా లభిస్తుండటంతో వీటి ధరలుకూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో వీటి అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విద్యుత్ వాహనాలు పెరుగుతున్న నేపధ్యంలో వాటికి అవసరమైన విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పై ప్రముఖ కంపెనీలు దృష్టిపెట్టాయి.

వాహనతయారీ రంగంలో ప్రముఖ సంస్ధగా ఉన్న టాటా సంస్ధ దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకోసం హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ హెచ్ పిసిఎల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న హెచ్ పిసి ఎల్ రిటైల్ అవుట్ లెట్లలో టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే టాటాపవర్ తన దైన ముద్రవేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో ఐదువందల పబ్లిక్ చార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది.

మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు దిశగా హెచ్ పీసిఎల్ తో ఒప్పందం చేసుకుంది. టాటా పవర్ ఒప్పందంతో ఇక పై దేశ వ్యాప్తంగా 18వేల హెచ్ పీసీఎల్ అవుట్ లెట్లలో విద్యుత్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ చార్జింగ్ పాయింట్లు పెరిగితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని టాటా పవర్ ఈవీ చార్జింగ్ హెడ్ సందీప్ బాంగియా తెలిపారు.