England’s Template: మా జట్టును కాపీ చేస్తున్నారు.. తప్పులేదు: మోయిల్ అలీ

బాగా రాణిస్తోన్న జట్టును ఇతర జట్లు అనుకరించడం సాధారణమేనని చెప్పాడు. ‘జట్టు నమూనా’ అంశం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోందని అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓ ఉత్తమ జట్టుగా ఉందని చెప్పాడు. జట్టు ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడంతో మోర్గాన్ గొప్ప కృషి చేశాడని తెలిపాడు. అన్ని రకాల పరిస్థితులు, వాతావరణంలో తాము ఇప్పుడు ఆడగలుగుతున్నామని చెప్పాడు.

England’s Template: మా జట్టును కాపీ చేస్తున్నారు.. తప్పులేదు: మోయిల్ అలీ

England’s Template: ప్రత్యర్థి జట్లు తమ జట్టు ఆటతీరు (నమూనా)ను కాపీ చేయడంతో తప్పేమీ లేదని ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ అన్నాడు. గతంలో పలు జట్లు ఆస్ట్రేలియా నమూనాను కాపీ చేసేవని, ఇప్పుడు తమ నమూనాను కాపీ చేస్తున్నాయని చెప్పాడు. గత వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచ కప్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ నమూనాను పలు జట్లు కాపీ చేస్తున్నాయంటూ వస్తున్న ప్రచారంపై మోయిన్ అలీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

2015 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ ఓడిపోయి ఇంటికి చేరినప్పటి నుంచి అప్పటి కెప్టెన్ ఓయాన్ మార్గన్ జట్టు ఆలోచనా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చాడు. అదే తీరును ప్రస్తుత కెప్టెన్ జోస్ బట్లర్ కూడా కొనసాగిస్తున్నాడు. దీనిపై మోయిన్ అలీ మాట్లాడుతూ… బాగా రాణిస్తోన్న జట్టును ఇతర జట్లు అనుకరించడం సాధారణమేనని చెప్పాడు. ‘జట్టు నమూనా’ అంశం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోందని అన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ ఓ ఉత్తమ జట్టుగా ఉందని చెప్పాడు. జట్టు ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడంతో మోర్గాన్ గొప్ప కృషి చేశాడని తెలిపాడు. అన్ని రకాల పరిస్థితులు, వాతావరణంలో తాము ఇప్పుడు ఆడగలుగుతున్నామని చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..