Tech Tips : ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బులు పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ ఫోన్లో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ కారణంగా యూపీఐ పేమెంట్లు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే UPI పేమెంట్లు చేస్తున్న సమయంలో నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారా?

Tech Tips : ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బులు పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips How to send money through UPI without using internet

Tech Tips : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ ఫోన్లో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ కారణంగా యూపీఐ పేమెంట్లు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే UPI పేమెంట్లు చేస్తున్న సమయంలో నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారా? చాలా మంది యూజర్లు ఈ రోజుల్లో తక్కువ నగదును వెంట తీసుకెళ్తున్నారు.

డబ్బు బదిలీల కోసం UPI పేమెంట్లపై మాత్రమే ఆధారపడొచ్చు. కానీ, ఇంటర్నెట్‌ని ఉపయోగించి లావాదేవీలు చేయడం అనేది స్లో లేదా 2G నెట్‌వర్క్ కారణంగా సమస్యలు తలెత్తుతాయి. ఆన్‌లైన్‌లో UPI ప్రాసెస్‌ను నిలిపివేయడం వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే, UPI పేమెంట్లను ప్రారంభించడానికి ఆఫ్‌లైన్ ప్రక్రియ ఉంది. మనలో చాలా మందికి తెలియదు. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ నుంచి USSD కోడ్ ‘*99#’ డయల్ చేయండి.

భారత్‌లోని బ్యాంకుల అంతటా UPI పేమెంట్ల ప్రాసెస్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ‘*99# సర్వీసు’ను ప్రారంభించింది. యూజర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయవచ్చు. మొబైల్ స్క్రీన్‌పై కనిపించే ఇంటరాక్టివ్ మెనూ ద్వారా డబ్బు పేమెంట్స్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సర్వీసులను పొందవచ్చు.

NPCI వివిధ సర్వీసులను *99# సేవ కింద అందిస్తుంది. అకౌంట్ ఫండ్‌లకు ఇంటర్‌బ్యాంక్ అకౌంట్ పంపడం, తీసుకోవడం, బ్యాలెన్స్ చెక్, ఇతర సర్వీసుల హోస్ట్‌తో పాటు UPI పిన్‌ని సెట్ చేయడం / మార్చుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ‘*99#’ USSD కోడ్‌ని ఉపయోగించి UPI పేమెంట్ల ప్రారంభించడానికి దశల వారీ ప్రక్రియ ఉంది.

Tech Tips How to send money through UPI without using internet

Tech Tips How to send money through UPI without using internet

UPI ఆఫ్‌లైన్ నుంచి డబ్బును ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి
* మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేయండి.
* మీ బ్యాంక్ నుంచి ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో మెనూ పాప్ అవుతుంది.

* Send Money
* Request Money
* Check Balance
* My Profile
* Pending Request
* Transactions
* UPI Pin

* డబ్బు పంపేందుకు money type 1పై Send నొక్కండి.
* ఇప్పుడు మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో ఎంచుకోండి.
* మొబైల్ నంబర్, UPI ID, Save చేసిన లబ్ధిదారులు, ఎంపిక సంఖ్యను టైప్ చేసి, Send నొక్కండి.
* మీరు మొబైల్ నంబర్ ద్వారా Transfer ఎంచుకోవచ్చు. రిసీవర్ UPI అకౌంట్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, Send నొక్కండి.
* మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, Sendపై Tap చేయండి.
* ఇప్పుడు పేమెంట్ కోసం Remarksని ఎంటర్ చేయండి.
* మీ లావాదేవీని పూర్తి చేసేందుకు UPI PINని రిజిస్టర్ చేయండి.
* మీ UPI లావాదేవీ ఆఫ్‌లైన్‌లో పూర్తవుతుంది.

మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99# ఉపయోగించి, సూచనలను ఫాలో అవ్వడం ద్వారా UPI సర్వీసులను ఆఫ్‌లైన్‌లో డిసేబుల్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : BSNL 4G Services : 2023లో ముందుగా బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసులు.. ఆ తర్వాతే 5G సర్వీసులు..!