Telangana : వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ..18న డ్రా, ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు

తెలంగాణ వైన్‌ షాపులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం దుకాణాలకు 2021-2023 సంవత్సరానికి సర్కార్‌ నోటిఫికేషన్ జారీ చేసింది.

Telangana : వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ..18న డ్రా, ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు

Tg Wine

Updated On : November 7, 2021 / 7:48 AM IST

Telangana Liquor : తెలంగాణ వైన్‌ షాపులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం దుకాణాలకు 2021-2023 సంవత్సరానికి సర్కార్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ఫీజును రెండు లక్షలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ సారి మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఈ నెల 16 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. 18న వైన్‌ షాపులకు డ్రా జరగనుంది.

Read More : Drug Racket : వరంగల్‌ మత్తు కథా చిత్రమ్!..అమ్మాయిలతో మత్తులో జోగుతూ.. విద్యార్థుల పార్టీలు

కొత్త మద్యం పాలసీతో.. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 216 షాపులున్నాయి. లిక్కర్‌ షాపుల ఏర్పాటులో.. గౌడ్‌లు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు  కల్పించనుంది ప్రభుత్వం. దీంతో.. కొత్త దుకాణాల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సంఖ్యపై మాత్రం స్పష్టత లేదంటున్నారు  ఎక్సైజ్‌ అధికారులు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తేనే సంఖ్య తెలనుంది.

Read More : Andhra Pradesh : పర్యాటకులకు గుడ్ న్యూస్..ఛలో పాపికొండలు

దాదాపు పది నుంచి పదిహేను శాతం వరకు మద్యం దుకాణాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మద్యం దుకాణ కేటాయింపులను ఎక్సైజ్‌ శాఖ సులభతరం చేసింది. ఒక్క మద్యం దుకాణానికి ఒకే  పేరుతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ప్రతి దరఖాస్తుకు రెండు లక్షల మేర ఫీజు చెల్లించాలి. ఒక్కరు ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, లాటరీలో ఎన్ని వచ్చినా ఒక్క మద్యం  దుకాణాన్నే కేటాయిస్తారు.