Andhra Pradesh : పర్యాటకులకు గుడ్ న్యూస్..ఛలో పాపికొండలు

గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు రంగం సిద్ధమైంది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

Andhra Pradesh : పర్యాటకులకు గుడ్ న్యూస్..ఛలో పాపికొండలు

Papikondalu

Boat Trip To Papikondalu : గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు రంగం సిద్ధమైంది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 2019లో కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల యాత్రను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే యాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేవలం 11 బోట్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 2 టూరిజం బోట్లు, 9 ప్రైవేటు బోట్లు ఉన్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి పోచమ్మగండికి తిరిగి వచ్చేలా పేరాలంటాపల్లిలో ఉండే సమయాన్ని కుదించింది.

Read More : Pompeii: పురావస్తు శాఖ అధికారులు కనుగొన్న 2వేల ఏళ్ల నాటి పురాతన గది

తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా APTDC వెబ్‌సైట్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 12 వందల 50 రూపాయలు చెల్లించాలి. అటు పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది.

Read More : Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు

రెండు ప్రభుత్వ బోట్లు, 9 ప్రైవేటు బోట్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఉదయం 9 గంటల లోపు బయలు దేరి తిరిగి సాయంత్రం 5 గంటలకు గండి పొసమ్మతల్లి గుడి ప్రాంతానికి చేరుకునేలా సమయాన్ని నిర్ధేశించారు. గోదావరి నది పాపికొండల ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ వెల్లడించారు. బోట్లు అన్ని ఒకే సమయంలో బయలుదేరాలని, అన్ని బోట్లకు ఒక పైలెట్ బోటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కట్రోల్ రూంలు ఏర్పాట్లు చేసి శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచినట్లు, ప్రతి అరగంటకు ఎక్కడ ఉన్నారో సమాచారం తెలుసుకొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని, డ్రై రన్ అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిదిద్దుకోవడం జరుగుతుందన్నారు.