Minister KTR: మ‌న దేశంలో ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తాయి: కేటీఆర్ వ్యాఖ్య‌లు

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌న దేశంలో ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తాయని, దేశ‌ ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లో ఇవాళ జాతీయ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కేంద్ర స‌ర్కారు నిన్న ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో దేశాభివృద్ధికి నిధులు కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డ‌లేదని, రాజ‌కీయాల కోస‌మే కేంద్రం ప‌నిచేస్తున్న‌ట్లు ఉంద‌ని విమ‌ర్శించారు.

Minister KTR: మ‌న దేశంలో ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తాయి: కేటీఆర్ వ్యాఖ్య‌లు

Minister KTR: కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌న దేశంలో ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తాయని, దేశ‌ ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లో ఇవాళ జాతీయ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… కేంద్ర స‌ర్కారు నిన్న ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో దేశాభివృద్ధికి నిధులు కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డ‌లేదని, రాజ‌కీయాల కోస‌మే కేంద్రం ప‌నిచేస్తున్న‌ట్లు ఉంద‌ని విమ‌ర్శించారు.

మ‌న దేశంలో 60 శాతం జ‌నాభా యువ‌తేన‌ని గుర్తు చేశారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయ‌ని, మ‌నం కూడా ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే అగ్ర‌స్థానంలో నిలుస్తామ‌ని చెప్పారు. భార‌త్ లో మానవ వనరులు కావాల్సినంత ఉన్న‌ప్ప‌టికీ వాడుకోవ‌డం లేద‌ని తెలిపారు. మ‌న దేశంలో చాలా మంది యువత ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నార‌ని చెప్పారు.

హైద‌రాబాద్ కంటే సింగపూర్ విస్తీర్ణంలో చిన్నద‌ని, అభివృద్ధిలో ఆ దేశం దూసుకెవెళ్తుంద‌ని తెలిపారు. బీఆర్ఎస్ పాల‌న‌లో కొన్నేళ్లుగా తెలంగాణ కూడా అభివృద్ధి సాధిస్తోంద‌ని చెప్పారు. భార‌త‌ జీడీపీలో దాదాపు అయిదు శాతం వాటా తెలంగాణ రాష్ట్రానిదేన‌ని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ప‌లు అగ్ర‌ సంస్థలు వాటి రెండో అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నాయ‌ని చెప్పారు.

Woman Killed: తాను చనిపోయినట్లు నమ్మించేందుకు తనను పోలిన మహిళను హత్యచేసిన యువతి.. షాకింగ్ విషయం ఏమిటంటే ..