Woman Killed: తాను చనిపోయినట్లు నమ్మించేందుకు తనను పోలిన మహిళను హత్యచేసిన యువతి.. షాకింగ్ విషయం ఏమిటంటే ..

తాను చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తనను పోలిన మరో మహిళను వెతికి మాయమాటతో నమ్మించి హత్యచేసింది. 50సార్లు ఆ మహిళపై దాడిచేసి కారులో పడేసింది. మహిళ మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Woman Killed: తాను చనిపోయినట్లు నమ్మించేందుకు తనను పోలిన మహిళను హత్యచేసిన యువతి.. షాకింగ్ విషయం ఏమిటంటే ..

Woman Killed

Woman Killed: తాను చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తనను పోలిన మరో మహిళను వెతికి మాయమాటతో నమ్మించి హత్యచేసింది. 50సార్లు ఆ మహిళపై దాడిచేసి కారులో పడేసింది. మహిళ మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హత్యకు పాల్పడ్డ మహిళను, అందుకు సహకరించిన ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది.

Crime News: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన ముగ్గురు దుండగులు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

23ఏళ్ల షర్బన్ కె అనే మహిళ నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడేది. ఆమె భర్త నుండి విడిపోయింది. ఆమెకు ఓ ప్రియుడు కూడా ఉన్నాడు. కుటుంబంలో గొడవ కారణంగా తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని షర్బన్ భావించింది. ఆమెను పోలిన మనుషులకోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అచ్చం ఆమెను పోలిన మహిళ కనిపించింది. ఆమె పేరు ఖదీద్దా ఓ. జర్మనీలోని ఇంగోల్‌స్టాండ్‌లో బ్యూటీ పార్లర్‌ను నడుపుతుంది. ఆమెను పరిచయం చేసుకున్న నిందితురాలు.. బ్యూటీ ప్లార్లర్‌కు సంబంధించిన విషయాలపై చాట్ చేస్తూ ఆమెతో స్నేహాన్ని పెంచుకుంది. తనకు సౌందర్య సాధానాల విషయంపై కలవాలని పిలిపించింది. అయితే, తన కుటుంబ సభ్యులతో తన మాజీ భర్తను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పింది. ఆ తరువాత ఖాదీద్దాను కలుసుకొని కారులో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. అక్కడ తన ప్రియుడు సహాయంతో ఆమెను హత్యచేసింది.

Crime News: అమ్మాయి కోసం ఇంటర్, డిగ్రీ విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

పోలీసులు మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం మృతిచెందిన యువతి మద్యం సేవించదని తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు షర్బన్ సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేశారు. ఆమె చాలా మంది అమ్మాయిలతో చాట్ చేసినట్లు ఉంది. దానిలో అచ్చం షర్బన్ ను పోలిన యువతి కనిపించింది. అసలు విషయంపై ఆరాతీయగా.. చనిపోయింది ఖదీద్దా ఓ అని, షర్బన్ కాదని పోలీసులు గుర్తించారు. షర్బన్ ను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తన ప్రియుడితో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితురాలిని, అందుకు సహకరించిన ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కుటుంబ సభ్యులను తాను మరణించానని నమ్మించి తన ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో నిందితురాలు ఇలా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.