Telangana Covid List Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 672 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 979 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 582 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid List Update)

Telangana Covid List Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు

Telangana Covid Report

Telangana Covid List Update : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 10వేల 705 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 65 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 32 పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 46 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 672 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 979 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 8వేల 392 కరోనా పరీక్షలు నిర్వహించగా 63 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది.(Telangana Covid List Update)

Norovirus: కేరళలో నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, లక్షణాలు

అటు దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 4వేలకు పైగానే వస్తున్నాయి. యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా రెండోరోజు ఒకశాతం పైగా నమోదైంది.

ఆదివారం 2.78 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4వేల 518 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 4.13 లక్షల మందిని పరీక్షిస్తే.. 4వేల 270 కేసులొచ్చాయి. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గినా.. నాలుగువేలకు పైగానే కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు 1.62 శాతానికి పెరిగింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు.

మరోవైపు యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 25వేల 782కు ఎగబాకింది. ఆ రేటు 0.06 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో మరో 2వేల 779 మంది కోలుకున్నారు. నేటివరకు దేశంలో 4.26 కోట్ల(98.73 శాతం) మందికి పైగా కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో మరో 9మంది కొవిడ్ తో మరణించారు. సెలవురోజు కావడంతో నిన్న 2.57 లక్షల మందే టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Covid List Update)

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ కేసుల సంఖ్య గత మూడు నెలల గరిష్ఠానికి చేరింది. ఇలా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కొత్త వేరియంట్‌ కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ దీన్ని చేపట్టకుంటే.. వైరస్‌ ఉద్ధృతికి కారణాలు తెలుసుకోలేమని హెచ్చరిస్తున్నారు.

ఒమిక్రాన్‌ దాని సబ్ వేరియంట్లే కారణం అయినట్లు భావిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అండ్‌ సొసైటీ (TIGS) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. ఒకవేళ బాధితులు అనారోగ్యం బారినపడితే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించాలని.. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే ఎంతో కీలకమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను అధికంగా చేపట్టాలని సూచించిన ఆయన.. ఆస్పత్రికి వచ్చే ప్రతి వ్యక్తి నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.(Telangana Covid List Update)

ఇలాంటి వైరస్‌లు ఎప్పుడూ మార్పులకు గురవుతూనే ఉంటాయని.. వైరస్‌ మార్పులకు లోనైన సమయాల్లో కేసుల సంఖ్య పెరగడం సాధారణమేనని ఎయిమ్స్‌ నిపుణులు డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ తెలిపారు. అయితే సెకండ్, థర్డ్ వేవ్‌ల నాటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదని డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు.