Home Appliances : మధ్యతరగతి ప్రజలకు మరో షాక్..ప్రియం కానున్న గృహోపకరణాలు!

కంపెనీలు ఏడాదిలో అనేకమార్లు ధరలు పెంచాయి. కొత్త సంవత్సరంలో ధరలు మళ్లీ పెంచుతామని ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి...

Home Appliances : మధ్యతరగతి ప్రజలకు మరో షాక్..ప్రియం కానున్న గృహోపకరణాలు!

Home

Home Appliances : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలకు మరో షాక్‌ తగలబోతోంది. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాల వస్తువుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోనున్నాయి. కార్లు, బైక్‌లు వంటి వాహనాల ధరలు కూడా సామాన్యునికి అందకుండా పోతున్నాయి. వచ్చే మూడునెలల్లో నాలుగు నుంచి 10శాతం రేట్లు పెంచుతామని ఆయా కంపెనీలే ప్రకటిస్తున్నాయి.

Read More : NASA : విశ్వం పుట్టుక తెలుస్తుందా ?..నింగిలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల ధరలను కంపెనీలు ఇప్పటికే 3 నుంచి 5శాతం పెంచాయి. వచ్చే నెల నుంచి 6 నుంచి 10శాతం పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో గృహోపకరణాల ధరలు రెండు,మూడు సార్లు పెరిగాయి. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ధరలు, సరఫరాల్లో ఆటంకం వంటివి ధరల పెరుగుదలకు కారణాలని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.

Read More : U19 Asia Cup: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం

స్టీల్, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటివాటి ధరలు 22 నుంచి 23శాతం పెరిగాయి. ఉత్పత్తికి, సరఫరాకు అవుతున్న వ్యయాన్ని రాబట్టుకునేందుకే వరసగా ధరలు పెంచాల్సి వస్తోందని, లాభాల కోసం కాదని కంపెనీలు చెబుతున్నాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, స్కోడా, వ్యాక్స్ వాగన్.. ఇలా దాదాపు అన్ని కంపెనీలు ఏడాదిలో అనేకమార్లు ధరలు పెంచాయి. కొత్త సంవత్సరంలో ధరలు మళ్లీ పెంచుతామని ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి.