Hyderabad : హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న ఎండలు.. మరో ఐదు రోజులు

హైదరాబాద్ మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం వేళల్లోనే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు...

Hyderabad  : హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న ఎండలు.. మరో ఐదు రోజులు

Hyd

Hyderabad : భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో కంటే.. ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతూ.. రికార్డులు బద్ధలవుతున్నాయి. 122 ఏళ్లలో అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో నమోదయ్యాయని భారత వాతావరణశాఖ తెలిపడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో సైతం సూర్యుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమౌతోంది. మధ్యాహ్నం అయ్యే సరికి ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు.

Read More : Rainfall In May : ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – IMD

ఎండల నుంచి రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఈక్రమంలో.. భారత వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం వేళల్లోనే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐదు రోజుల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read More : Summer Heat Waves : భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం

మరోవైపు.. చల్లటి కబురు కూడా చెప్పింది. ఈ వర్షాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం నుండి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయువ్య ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ ద్వీపకల్పంలో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, పశ్చిమ – మధ్య, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.