Talasani Srinivas Yadav : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. విద్యార్థులకు దేశభక్తి సినిమాలు ఫ్రీగా చూపిస్తాం..
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ''మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు..................

Talasani Srinivas Yadav : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో పలు కార్యక్రమాలని నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలని కూడా ఇందులో భాగం చేస్తుంది. తాజాగా ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫ్రీగా దేశభక్తి సినిమాలు చూపించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యాలయంలో ఫిలిం డెవలప్‌మెంట్ అధికారులు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ఫిలిం ఛాంబర్ వ్యక్తులు, నిర్మాతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ”మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ మహాత్మా గాంధీ చరిత్రను తెలియజేసే, దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన దేశభక్తి సినిమాలని రాష్ట్రంలోని 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం 2 లక్షల మంది విద్యార్థులకు దేశభక్తి సినిమాలు చూపించాలి. విద్యార్థులను థియేటర్‌లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. దీనికి మీరంతా సహకరించాలి” అని కోరారు. ఇందుకు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.